OTTలోకి నవ్వులు దోచే దొంగ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ ప్రియులకు ప్రతీ వారం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటూనే వస్తోంది. కొత్త వారం వచ్చిందంటే చాలు అనేక కొత్త కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ ప్రియులను ఎంటర్ టైన్ చేసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీలో సరికొత్త కామెడీ చిత్రాలు ఉండగా.. మరో అదిరిపోయే మూవీ కడుపుబ్బా నవ్వించేందుకు రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అభినవ్ గోమఠం ప్రధాన ప్రాతలో రాబోతున్న సరికొత్త కామెడీ చిత్రిమే మై డియర్ దొంగ. ఈ చిత్రంలో అభినవ్ గోమఠంతో పాటు దివ్య శ్రీపాద, శాలిని కొండెపూడి, శశాంక్ మండూరి, నిఖిల్ గాజుల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించబోతున్నారు. కేవలం ప్రధాన పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా సినిమాకు రైటర్‌గా కూడా పని చేసింది శాలిని కొండెపూడి. అజయ్ అరసాడా సంగీతం అందించగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

దొంగతో లవ్వా అని ఓ వ్యక్తి అడగ్గా.. లవ్ లో దొంగ అంటూ ఓ అమ్మాయి చెబుతుంది. మొదటి నుంచి చివరి వరకు దొంగతో స్నేహం ఏంటి, దొంగను ప్రేమించడం ఏంటంటూ సాగుతుంది. ఇక చివర్లో అయితే ఓ యువకుడు లవ్ గురించి చెప్పిన డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. లవ్ అంటే ఎమోషన్ కాదని.. లవ్ అంటే ఇన్ఫర్మేషన్ అని చెబుతాడు. ఎక్కడున్నవ్, ఎప్పుడొస్తవ్, ఎవనితోని ఉన్నవ్.. లొకేషన్ పంపు.. ఇదే ప్రేమంటే అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ట్రైలర్ చూస్తుంటేనే భలే నవ్వొస్తుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో.
ఫుల్ హిలేరియస్ గా ఉండబోతున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది. ఏప్రిల్ 19న ఇది స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను కూడా అందుబాటులో ఉచ్చింది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండబోతున్న ఈ సినిమా శనివారమే ఓటీటీలోకి రాబోతుంది. కచ్చితంగా ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











