Bigg Boss Telugu 6 Elimination షానీ తర్వాత.. ఎలిమినేట్ అయింది ఎవరంటే? తొలివారం తప్పించకొన్నా రెండోవారం మాత్రం!
బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ ఇప్పుడిప్పుడే ఊపు అందుకొంటున్నది. బిగ్‌బాస్ తెలుగులో ఎన్నడూ లేని విధంగా తొలి వారం నామినేషన్ లేకుండానే తొలి వారాన్ని ముగించారు. అయితే రెండోవారంలో మాత్రం డబుల్ స్ట్రోక్‌తో డబుల్ నామినేషన్ హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌పై క్రేజ్ పెంచారు. ఈ వారం ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే.

రెండో వారంలో 8 మంది నామినేట్
Bigg Boss Telugu 6 రెండో వారం నామినేషన్‌లోకి వెళితే ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. రేవంత్, ఫైమా, మెరీనా, రోహిత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్, రాజశేఖర్, షానీ సాల్మన్ నామినేట్ అయ్యారు. దాంతో ఎవరు వెళ్లిపోతారనే విషయం ఆసక్తిగా మారింది.

షాని సాల్మన్ తొలి కంటెస్టెంట్‌గా
అయితే తొలివారం అంచనాలకు తలకిందులు చేస్తూ. రెండోవారం ఎలిమినేషన్‌లో వీకెండ్ మొదటి రోజునే షానీ సల్మాన్‌ను నాగార్జున ఎలిమినేట్ చేస్తూ ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే ఈ వారం జర్నీ చూపించకుండానే షానీ ఎలిమినేట్ అయి బయటకు పంపించారు.

ఓటింగ్, మిస్డ్ కాల్ డేటా ఆధారంగా
అయితే షానీ సల్మాన్ ఎలిమినేషన్ తర్వాత ఏడుగురు నామినేషన్ల ఉండటంతో ఎవరు వెళ్లిపోతారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఓటింగ్, మిస్డ్ కాల్ డేటా చివరి ఇద్దరు కంటెస్టెంట్ల విసయంలో టఫ్ టాస్క్‌గా మారింది. రాజశేఖర్, అభినయశ్రీ డేంజర్ జోన్‌లో ఉండటంతో ఎలిమినేషన్ కష్టంగా మారింది.

అభినయశ్రీ ఎలిమినేషన్
అయితే చివరికికి ఓటింగ్ డేటా ప్రకారం.. అభినయశ్రీని రెండోవారం రెండో కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ చేశారు. దాంతో ఇంటి నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. ఇక ఇంటిలో 19 మంది ఆటలో మిగిలారు. ఇక ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

రేవంత్ కన్నింగ్ అంటూ అభినయశ్రీ
ఇంటిలో నిజాయితీ వ్యక్తులు, నిజాయితీ లేని వ్యక్తుల ఎవరో చెప్పాలని ఆభినయశ్రీకి టాస్క్ ఇచ్చారు. అయితే ఇంటిలో నిజాయితీ ఉన్న లిస్టులో
ఫైమా, చలాకీ చంటీ, సత్య శ్రీ, బాలాదిత్య, ఆర్జే సూర్య పేర్లను పెట్టారు. నిజాయితీలేని వ్యక్తుల జాబితాలో రేవంత్‌ను అభినయశ్రీ పెట్టారు. అతడితోనే నేరుగా నీవు కన్నింగ్ అని చెప్పారు.


Click it and Unblock the Notifications











