నెల తిరక్కుండానే ఓటీటీలోకి విజయ్ సేతుపతి మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఏడాదికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మహారాజా చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి రీసెంట్‌గా నటించిన చిత్రం ఏస్. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యలో ఏస్ చిత్రం ఏ ఓటీటీలో రిలీజైంది? నెల తిరక్కుండానే ఓటీటీలోకి రావడానికి కారణాలేంటీ? ఒకసారి పరిశీలిస్తే..

ఏస్ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన రుక్మీణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. యోగి బాబు, బాబ్లూ పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, రమేశ్ తిలక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆర్ముగ కుమార్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్, సామ్ సీఎస్‌లు స్వరాలు సమకూర్చగా.. కిరణ్ బీ రావత్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Ace OTT Release Vijay Sethupathi s Ace movie Now streaming on this OTT platform

ఏస్ చిత్రం బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రచార కార్యక్రమాలతో ఏస్ చిత్రాన్ని దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. టెక్నికల్ వాల్యూస్, నిర్మాణ విలువలతో పాటు మలేషియా, దుబాయ్, కౌలాలంపూర్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోవడంతో ఏస్ చిత్రానికి నిర్మాణ వ్యయం పెరిగింది. టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు, విజయ్ సేతుపతి క్రేజ్‌తో ఏస్ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి ఈ చిత్రానికి రూ.20 కోట్ల బిజినెస్ చేసింది. ఏస్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.21 కోట్ల షేర్.. రూ.42 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

డిజాస్టర్‌గా నిలిచిన ఏస్
భారీ అంచనాల మధ్య థియేటర్‌లలొకి వచ్చిన ఏస్ సినిమా సినిమా తొలి రోజు కేవలం 1 కోటి రూపాయల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు 1.7 కోట్లు, మూడో రోజు 1.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు ఈ సినిమా 80 లక్షలు, ఐదో రోజు 60 లక్షల రూపాయలు, 6వ రోజు 50 లక్షలు రూపాయలు వసూలు చేసింది. 17 రోజుల వరకు ఈ సినిమా ఇండియాలో రూ.8.79 కోట్ల నెట్, రూ.10.37 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ డేటా చెబుతోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఏస్ సినిమా దాదాపు రూ.10 కోట్లకు పైగా నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తద్వారా విజయ్ సేతుపతి కెరీర్‌లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

నెల తిరక్కుండానే ఓటీటీలోకి
థియేట్రికల్ రన్‌ను క్లోజ్ చేసుకున్న ఏస్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా థియేటర్‌లలో రిలీజైన 5 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను కేవలం మూడు వారాల్లోగానే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాలతో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఏస్ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన విజయ్ సేతుపతి చిత్రం ఓటీటీలలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: vijay sethupathi ott news Ace
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X