Acharya OTT Release..మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా.. ఏ రోజు? ఎప్పుడు రిలీజ్ అంటే?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం థియేట్రికల్ రిలీజ్ దారుణంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలను కనీసం కూడా చేరుకోలేకపోయడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రెండో రోజే థియేటర్లు, బాక్సాఫీస్ వద్ద ప్రతికూల పవనాలు వీయడంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే థియేట్రికల్ రిలీజ్ ఫెయిల్ కావడంతో నిర్ణీత గడువు కంటే ముందే ఆచార్య సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆచార్య రిలీజ్ డేట్ ఎప్పుడు? ఏ ఓటీటీలో రిలీజ్ అంటే..

మెగా హిస్టరీలో ఎన్నడూలేనంతగా
సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచింది. ఈ క్రేజ్‌కు రాంచరణ్ తోడు కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పెదవి విరవడంతో మెగా హిస్టరీలో ఎన్నడూ లేనంతగా ఫ్లాఫ్‌ను సొంతం చేసుకొన్నది.

రెండోవారానికి ముగిసిన థియేట్రికల్ రన్
ఆచార్య చిత్రం 132 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల గ్రాస్‌ను, 40 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల గ్రాస్, 49 కోట్ల షేర్‌ను రాబట్టింది. రెండో వారానికి కల్లా థియేటర్ల నుంచి ఈ సినిమా బయటకు వచ్చింది.

భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదలకు ముందే ఆచార్య సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. వాస్తవానికి ఒప్పందం ప్రకారం మే చివరి వారంలో గానీ.. లేదా జూన్ మొదటి వారంలో గానీ రిలీజ్ కావాల్సింది. అయితే థియేటర్‌లో లేకపోవడం ఆచార్య సినిమాను ఓటీటీ ద్వారా ముందే రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.
మే 20వ తేదీన రిలీజ్ అంటూ అమెజాన్
అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన ప్రకారం.. ఆచార్య సినిమాను మే 20వ తేదీన ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆచార్య సినిమాను వచ్చేవారం రిలీజ్ చేస్తున్నామని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. థియేటర్‌లో చూడలేకపోయిన మెగా ఫ్యాన్స్‌కు అమెజాన్ శుభవార్తను అందించింది.

మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా
ఇక ఓటీటీలో మే 20వ తేదీన RRR చిత్రం జీ5లో రిలీజ్ అవుతున్న రోజే ఆచార్య కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కావడం మెగా అభిమానులకు డబుల్ బొనాంజాగా మారింది. ఒకే రోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాలు రావడం మెగా అభిమానులకు పండగ వాతావరణంగా మారింది. ఒకే రోజు పోటాపోటీగా అమెజాన్, జీ5 చిత్రం రిలీజ్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











