Acharya OTT: ఆ ఓటీటీలో ఆచార్య స్ట్రీమింగ్.. ఏ రోజు నుంచి మొదలవుతుందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఎక్కువ మంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘ కాలంగా ఈ కుటుంబమే టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుతోంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తే చూడాలని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా కోరుకున్నారు. వాళ్లందరి ఆశను నిజం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రమే 'ఆచార్య'. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈరోజే (ఏప్రిల్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలూ లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

తండ్రి కొడుకుల కాంబోలో ఆచార్య
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రను పోషించారు.

భారీ హైప్.. బిజినెస్ అత్యధికంగా
మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు బడా హీరోలు, అందునా తండ్రి కొడుకులైన చిరంజీవి, చరణ్ నటించడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు దీని నుంచి ఏది వచ్చినా భారీ స్పందన దక్కింది. దీంతో సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

గ్రాండ్ రిలీజ్.. థియేటర్లతో మోత
ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'ఆచార్య' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ మెగా అభిమానుల కేకలతో మోత మోగిపోతున్నాయి.

ఆచార్య సినిమాకు అలాంటి టాక్
మెగా హీరోల కాంబోలో రూపొందిన 'ఆచార్య' మూవీకి సంబంధించి ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెండు షోలు కూడా ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అయితే, దీనికి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

ఆచార్య స్ట్రీమింగ్‌పై ప్రచారాలతో
ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా సినిమా విడుదల అవుతుంటే.. ఆ తర్వాత వచ్చే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆచార్య' డిజిటల్ రిలీజ్ గురించి కూడా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఓటీటీ పార్ట్‌నర్, స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా చాలా రకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా ఇలా కూడా హైలైట్ అయిపోయింది.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ స్థాయిలో పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యధిక డీల్‌కు కొనుగోలు చేసిందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సినిమాలో కన్ఫార్మ్ చేసేశారు.

ఏ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది?
'ఆచార్య' మూవీ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. ఈ సినిమాను నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తాజాగా ఓ న్యూస్ కూడా లీకైంది. అంటే.. ఆచార్య ఏప్రిల్ 29న విడుదలైంది. కాబట్టి దీన్ని మే 29న లేదా 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











