Acharya OTT: రెండు వారాల ముందే ఓటీటీలోకి.. భారీ ఆఫర్‌కు ఆచార్య టీమ్ ఫ్లాట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో చాలా చిత్రాలు భారీ విజయాలను అందుకోవడంతో దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన భారీ మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

మెగా హీరోల కలయికలో ఆచార్య
మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రను చేశారు.

రికార్డు స్థాయి బిజినెస్ చేసుకుని
టాలీవుడ్‌నే ఏలుతోన్న ఇద్దరు బడా హీరోలు, అందునా తండ్రి కొడుకులైన చిరంజీవి, చరణ్ నటించడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు దీని నుంచి ఏది వచ్చినా భారీ స్పందన దక్కింది. దీంతో సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

అలాంటి టాక్‌తో స్పందన కరువు
క్రేజీ కాంబినేషన్‌లో సందేశాత్మకమైన కథతో రూపొందిన 'ఆచార్య' మూవీకి ఏ రేంజ్‌లో హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను అందుకుంది. ఫలితంగా ఈ సినిమాకు ఆరంభం నుంచే స్పందన అంతగా రావట్లేదు. ఇక, రోజులు గడుస్తోన్న కొద్దీ ఈ సినిమాకు రెస్పాన్స్ కరువు అయిపోతోంది.

ఆచార్యకు వచ్చిన కలెక్షన్లు ఇలా
'ఆచార్య' మూవీ ఏపీ, తెలంగాణలో ఆరు రోజులకు రూ. 40.33 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.66 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.71 కోట్లు షేర్, రూ. 74.70 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇంకా దీనికి 84.79 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

బడా ఓటీటీకి స్ట్రీమింగ్ హక్కులు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీని రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యధిక డీల్‌కు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సినిమాలో కన్ఫార్మ్ చేసేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నెల తర్వాతనే స్ట్రీమింగ్‌కు డీల్
'ఆచార్య' మూవీ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. ఈ సినిమాను నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తాజాగా ఓ న్యూస్ కూడా లీకైంది. అంటే.. ఆచార్య ఏప్రిల్ 29న విడుదలైంది. కాబట్టి దీన్ని మే 29న లేదా 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అయింది.

మరో డీల్.. 15 రోజుల ముందేనట
మెగా హీరోల కలయికలో వచ్చిన 'ఆచార్య' మూవీకి థియేటర్లలో పెద్దగా స్పందన దక్కకపోవడంతో చిత్ర యూనిట్‌కు అమెజాన్ ప్రైమ్ సంస్థ మరో ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీన్ని రెండు వారాల ముందుగానే స్ట్రీమింగ్ చేసుకునేందుకు మరో ఒప్పందం కుదుర్చుకుందట. దీంతో ఈ సినిమా మే 30న కాకుండా మే 15 నుంచే అమెజాన్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











