Maa Nanna Superhero OTT: ఓటీటీలోకి సుధీర్ బాబు ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Maa Nanna Superhero OTT: హీరో సుధీర్ బాబు(Sudheer Babu ) నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో' (Maa Nanna Superhero). తండ్రి కొడుకుల అనుబంధాన్ని ప్రధాన కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబ‌ర్ 11న రిలీజైంది. సుధీర్‌బాబుతో పాటు షాయాజీ షిండే, సాయిచంద్ లీడ్ నటించిన 'మా నాన్న సూపర్ హీరో' మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు కాబోతుందటే?

మా నాన్న సూపర్ హీరో సినిమా కథ విషయానికి వస్తే.. సొంత తండ్రి, ద‌త్త‌త తండ్రి మధ్య ఓ కొడుకు ప్ర‌యాణం ఎలా సాగింద‌నే పాయింట్‌ ఆఫ్ వ్యూ లో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. జానీ (సుధీర్ బాబు) చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకుంటాడు. తండ్రి లారీ డ్రైవర్. అనుకోకుండా గంజాయి కేసులో దొరికి జైలు పాలవుతాడు. దీంతో జానీ అనాధగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ (షాయాజి షిండే) జానీని దత్తత తీసుకుంటాడు. అప్పటివరకు బాగున్న శ్రీనివాస్ వ్యాపారాలు నష్టాల పాలవుతాయి. తన స్టాక్స్ ఘోరంగా పడిపోతాయి. దీంతో తనకు తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ భార్య కూడా చనిపోతుంది. జానీ రాకతోనే తన పరిస్థితి మారిపోయిందని, తన కొడుకును తిడుతూ ఉంటాడు శ్రీనివాస్.

Actor Sudheer Babu Maa Nanna Superhero movie will be streaming on ZEE5 OTT platform from 15th November

కానీ జానీ మాత్రం తన తండ్రినీ హీరో గా భావిస్తాడు. తన తండ్రి ఇంత ద్వేషించిన.. ఇప్పుడు ప్రేమ కురిపిస్తూనే ఉంటాడు జానీ. అక్రమంగా తన తండ్రి చేసినప్పుల్ని తీర్చుకుంటూ వస్తాడు. ఈ సమయంలో తన తండ్రి చేత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాస్ అయిన పొలిటిషన్ అతనిపై కేసు పెడతాడు. ఆ కేసు నుండి తన తండ్రిని బయట పడేయాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఈ క్రమంలో ప్రకాష్ (సాయిచంద్ )అనే వ్యక్తికి కోటి రూపాయల లాటరీ తగులుతుంది . ఆ డబ్బులు తీసుకురావడానికి తోడుగా కేరళకు రమ్మని జానీని ప్రకాష్ కోరుతాడు. ప్రకాష్ లాటరీ డబ్బులతో తండ్రి శ్రీనివాసును జైలు నుండి విడిపించుకోవాలని ప్లాన్ చేస్తాడు జానీ. ఈ క్రమంలో ప్రకాష్- జానీ ఇలా మధ్య సాగిన జర్నీలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి? ప్రకాష్ జానీల మధ్య సంబంధం ఎలా తెలుస్తుంది? అనేది ఈ సినిమా కథ

'మా నాన్న సూపర్ హీరో' తండ్రికొడుకుల మధ్య అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కింది. ఈ మూవీ కథ ప్రకారంగా ప్రేక్షకుల మనసును హత్తుకుందనడంలో అతిశయోక్తి లేదు.ఈ మూవీలో సుధీర్‌బాబు నటన అదుర్స్. ఆయన నటుడుగా ఓ మెట్టు ఎక్కాడనే చెప్పాలి. తన నటనలో చాలా మేర్చుర్టీ కనపించింది. అలాగే.. సాయిచంద్ నటన కూడా అద్భుతం. దూర‌మైన కొడుకును క‌లుసుకోవాల‌ని ఆరాట‌ప‌డే తండ్రి పాత్ర‌లో ఆయన ఒదిగిపోయాడు. పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. షాయాజీ షిండే యాక్టింగ్ కూడ ఇరగదీశారు.ఆమ‌ని తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

Actor Sudheer Babu Maa Nanna Superhero movie will be streaming on ZEE5 OTT platform from 15th November

దసరా కానుకగా థియేటర్స్‌లో విడుదలైన 'మా నాన్న సూపర్ హీరో' ఫాదర్ సెంటిమెంట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌(Digital Streaming)కు సిద్దమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోంది. కాగా.. ఈ మూవీ నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. మరీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది వేచిచూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X