OTTలోకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

ఓటీటీలోకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించి సినిమా కథ వెనుక కథ. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రిమియర్ కు సిద్దం అయింది. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అసలు ఈ సినిమా కథేంటి.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ...:కరోనా తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగింది. ఓటీటీ కంటెంటుకు బాగా అలవాటు పడ్డారు. ఇక సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటారనే విషయం తెలిసిందే. అలాంటి చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే కోవలో ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కథ వెనుక కథ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది.

Actor Sunil Suspense Thriller Katha Venuka Katha Movie Streaming on Etv Win OTT From March 28th Full Details Here

ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి...:కమెడియన్, విలన్, హీరో సునీల్, విశ్వాంత్ దుద్దుంపూడి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ. ఈ సినిమాకు కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం గ‌త ఏడాది మే 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయి ఆకట్టుకుంది. థియేటర్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా... ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. దాదాపు ఏడాది త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది.

ఈటీవీ విన్ ఓటీటీలో....:సస్పెన్స్ థ్రిల్లర్ క‌థ వెనుక క‌థ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క‌థ వెనుక క‌థ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ ఆఫీషియ‌ల్‌ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసి అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో శ్రీజీత ఘోష్ హీరోయిన్‌గా న‌టించగా... శుభ‌శ్రీ, జ‌య‌ప్ర‌కాష్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. చిన్న సినిమాగా రిలీజైన క‌థ వెనుక క‌థ ప్రేక్ష‌కుల్ని మెప్పించకపోయినా.. ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Actor Sunil Suspense Thriller Katha Venuka Katha Movie Streaming on Etv Win OTT From March 28th Full Details Here

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... :సినిమా డైరెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌నే యువ‌కుడు (విశ్వాంత్) ఓ కథను రాసుకుంటాడు. సునీల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించగా.. విశ్వాంత్‌ రాసుకున్న కథలో మాదిరిగానే.. సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోతారు. ఆ మిస్స‌యిన అమ్మాయిను ఎవరో చంపుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయ‌టానికి ఓ పోలీస్ ఆఫీస‌ర్ (సునీల్)... ఈ మ‌ర్డ‌ర్స్ మిస్టరీని సాల్వ్ చేశాడా..? అస‌లు అమ్మాయిలు సిటీలో క‌నిపించ‌కుండా పోవ‌టానికి కార‌ణమెవరు...? అసలు నిందింతులను పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడ‌న్న‌దే క‌థ వెనుక క‌థ చిత్రం.

ఇక ఈ సినిమాలో సునీల్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో మెప్పించాడు. ఓ పిట్ట‌క‌థ, కేరింత వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వాంత్‌ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. మీరు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలంటే.. ఈ వీకెండ్ కు కథ వెనుక కథ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X