Iravatham ఓటీటీలో దుమ్మురేపుతున్న ఎస్తేర్ నోర్హా.. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఐరావతం రికార్డ్

ఫీల్‌గుడ్ కంటెంట్‌తో వచ్చే చిన్న చిత్రాలు ఊహించని విజయాలు అందుకోవడం సాధారణంగా జరుగుతుంటాయి. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఐరావతం సినిమా కూడా భారీ రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. యువ హీరోయిన్ ఎస్తేరా నోర్హా, టెలివిజన్ నటుడు అమర్ దీప్, సప్తగిరి, తన్వీ నేగీ నటించిన ఈ చిత్రం ఓటీటీలో రికార్డు స్థాయిలో రెస్సాన్స్ అందుకొంటున్నది. ప్రముఖ ఓటీటీ ఛానెల్ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా సాధించిన రికార్డు వివరాల్లోకి వెళితే..

విభిన్నమైన కంటెంట్‌కు పెద్ద పీట వేస్తారనే విషయాన్ని ఐరావతం సినిమా మరోసారి నిరూపించింది. వైట్ కెమెరా చేసిన మ్యాజిక్ ఆధారంగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌ డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో విశేషంగా ఆదరిస్తున్నారు.

Actress Ester Noronhas Iravatham movie gets record views on Disney hotstar

ఈ చిత్రం Disney+Hotstar ఏకంగా 200 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. చిన్న చిత్రమైనా భారీ చిత్రాలతో పోటీ పడుతూ భారీగా వ్యూస్ సాధిస్తున్నది. గతేడాది నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఐరావతం చిత్రం ట్రెండింగ్‌గా నిలిచింది.

ఐరావతం సినిమా విషయానికి వస్తే.. శ్లోక అనే యువతికి బర్త్ డే రోజున వైట్ కెమెరా బహుమతిగా వస్తుంది. వైట్ కెమెరా తన జీవితంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆమె లైఫ్ అనేక ఇబ్బందుల్లో పడుతుంది. శ్లోక జీవితాన్ని వైట్ కెమెరా ఎలా తలకిందులు చేసిందనే ప్రశ్నలకు సమాధానమే ఐరావంతం సినిమా కథ. దర్శకుడు గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీని ఆద్యంతం కట్టిపడేసేలా తెరకెక్కించారు. నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పించారు. రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మించారు.

Actress Ester Noronhas Iravatham movie gets record views on Disney hotstar

నటీనటులు: ఎస్తేరా నోర్హా, అమర్ దీప్, సప్తగిరి, తన్వీ నేగీ తదితరులు
నిర్మాత‌లు: రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట
సమర్పణ: రేఖ పలగాని
కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : సుహాస్ మీరా
సినిమాటోగ్రాఫ‌ర్‌: ఆర్ కె వెల్లపు
మ్యూజిక్: సత్య కశ్యపు
రీరికార్డింగ్: కార్తిక్ కడగండ్ల
లిరిక్స్‌: పూర్ణాచారి
ఎడిటింగ్‌: సురేష్ దుర్గం
పీఆర్వో: మధు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X