దుబాయ్ పిల్లతో సుడిగాలి సుధీర్ ప్రేమ.. వద్దంటున్నా వినకుండా చిలిపి పనులు.. వీడియో వైరల్

సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, సినిమాల్లో సైతం రాణిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. తద్వారా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్‌లతో హైలైట్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ టాలెంటెడ్ గాయ్‌తో ఓ దుబాయ్ పిల్ల చేసిన రచ్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూసేయండి!

బుల్లితెర ఆల్‌రౌండర్‌గా
మ్యాజిక్‌లు చేసుకునే ప్రొఫెషన్ నుంచి కమెడియన్‌గా మారిన సుడిగాలి సుధీర్.. జబర్ధస్త్ షోతో అంచెలంచెలుగా ఎదిగాడు. తద్వారా స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింతగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే డ్యాన్సర్‌గా, సింగర్‌గా కూడా మెప్పించి ఆల్‌రౌండర్‌గా మారాడు.

Actress Hameeda Fell In Love With Sudigali Sudheer in Sarkaar 4 Show

సినిమాల్లోనూ రాణించి

టెలివిజన్ రంగంలో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. సినిమాల్లోకి వచ్చి క్రేజీ రోల్స్ చేశాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితమే హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. కానీ, 'గాలోడు'తో కెరీర్ బెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకుని తన రేంజ్‌ను పెంచుకున్నాడు.

గోట్ అంటూ మరొకటి
'గాలోడు' వంటి విజయం తర్వాత సుడిగాలి సుధీర్ ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నాడు. ఇలా ఇటీవలే 'కాలింగ్ సహస్ర' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఈ మూవీ అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేదు. అయితే, ఇప్పుడు ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఈ టాలెంటెడ్ గాయ్ 'GOAT' అనే సినిమాలో నటిస్తున్నాడు. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ, టీవీలో మళ్లీ

కొద్ది రోజులుగా బుల్లితెరపై సందడి చేయని సుడిగాలి సుధీర్.. తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టాడు. అలాంటిది ఇప్పుడు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చేసి 'ఫ్యామిలీ స్టార్స్' అనే షో చేస్తున్నాడు. దీనితో పాటు ఆహా ఓటీటీలో 'సర్కార్ 4' అనే గేమ్‌ షోను కూడా హోస్ట్ చేస్తున్నాడు. ఇది మాత్రం మంచి ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.

అమ్మాయిలతో ఫుల్లు
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో 'సర్కార్ 4' షోను చేస్తున్నాడు. ఇందులో పదో ఎపిసోడ్ కోసం యాంకర్ స్రవంతి చోకారపు, బిగ్ బాస్ బ్యూటీలు హమీదా, శుభశ్రీ రాయగురు, శోభా శెట్టిలు వచ్చారు. ఈ అమ్మాయిలతో కలిసి అతడు తనదైన రీతిలో సందడి చేశాడు. ముఖ్యంగా ఇందులో స్రవంతి అతడిపై పంచుల వర్షం కురిపించింది. మిగిలిన వాళ్లూ ఆడుకున్నారు.

హమీద ప్రేమ.. హగ్స్

'సర్కార్ 4' తాజా ప్రోమోలో సుడిగాలి సుధీర్‌పై హమీదా ప్రేమను చూపిస్తూ షాకిచ్చింది. అతడిపై తరచూ నాటీగా కామెంట్లు చేస్తూ కనిపించింది. అంతేకాదు, తరచూ స్టేజ్ మీదకు వెళ్లి సుడిగాలి సుధీర్‌కు హగ్గుల మీద హగ్గులు ఇచ్చేసింది. దీంతో వీళ్లిద్దరి ట్రాక్ బాగా హైలైట్ అయిపోయింది. ఫలితంగా ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X