Don't Miss!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2 యాసిడ్ పోస్తాం.. షూటర్‌తో చంపిస్తామని బెదిరింపులు.. బాలకృష్ణతో జయప్రద సంచలన విషయాలు
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన అన్‌స్టాపబుల్ షో దేశంలోనే టాప్ రేటింగ్ ఉన్న కార్యక్రమంగా ఘనతను సాధించింది. ఇటీవల ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 2 శరవేగంతో అభిమానుల మనస్సులను దోచుకొంటున్నది. తాజాగా ఈ షోలోకి సీనియర్ నటీమణులు జయప్రద, జయసుధ, యువ హీరోయిన్ రాశీ ఖన్నా సందడి చేశారు. అయితే ఈ షోలో జయప్రద తన గతంలో చోటుచేసుకొన్న సంఘటన తలచుకొని ఎమోషనల్ అయ్యారు. బాలకృష్ణతో పంచుకొన్న ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..

కెరీర్ టాప్‌లో ఉండగానే.. రాజకీయాల్లోకి
జయప్రద స్టార్ హీరోయిన్‌గా ఉన్న రోజుల్లోనే నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయింది. అనంతరం చోటుచేసుకొన్న పరిణామాలతో ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్ వాదీపార్టీలో చేరింది. రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత కలహాల కారణంగా ఆమెకు ప్రాణహాని సంబంధిత బెదిరింపులు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లో అల్లరి మూకల ఘటన
Unstoppable Season 2 Show లో బాలకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు జయప్రద ఎమోషనల్ అయ్యారు. తనను కొంత మంది మూకలు, పోలీసులు చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ సంఘటన తలుచుకొంటే.. ఇప్పటికీ నిద్ర నుంచి ఉలిక్కి పడుతాను. నా జీవితంలో చాలా చేదు అనుభవం. కానీ ఆ బెదిరింపులకు బయపడలేదు అని జయప్రద చెప్పారు.

యాసిడ్ దాడి చేస్తామంటూ
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ రాజకీయాల్లో నాకు వ్యతిరేకంగా కొందరు కార్యక్రమాలు చేపట్టారు. బయటకు వస్తే ముఖం మీద యాసిడ్ దాడి చేస్తాం. నిన్ను చంపడానికి షూటర్‌ను పెట్టించాం. బయటకు వస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అయితే ఆ బెదిరింపులను ఎన్నడూ లెక్కచేయలేదు. నా నియోజకవర్గంలో ఎప్పటిలానే తిరిగాను అని జయప్రద చెప్పారు.

మా అమ్మకు అలా చెప్పి బయటకు..
అయితే ప్రతీ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో వెళ్లి వస్తాను అని మా అమ్మకు చెప్పేదానిని. అయితే ప్రాణహాని తలపెడుతామని బెదిరింపులు వచ్చిన తర్వాత నేను బయటకు వెళ్లేటప్పుడు వెళ్తాను అని మాత్రమే చెప్పేదానిని. ఎందుకంటే బయటకు వెళ్తే నేను తిరిగి వస్తాననే నమ్మకం ఉండేది కాదు. అందుకే బయటకు వెళ్తిన తర్వాత నేను ప్రాణాలతో తిరిగి వస్తానా అనే సందేహం ఉండేది అని జయప్రద తెలిపారు.

జయప్రదను ప్రశంసించిన బాలయ్య
అయితే జయప్రద తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పిన తర్వాత ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకొన్నారు. బెదిరింపులు వచ్చిన తర్వాత కూడా భయపడకుండా.. వస్తాను అంటూ బయటకు వెళ్లావు కదా. అదే నీ జీవితంలో, నీ మనోధైర్యానికి అన్‌స్టాపబుల్ అని బాలకృష్ణ ప్రశంసించారు. తాజా ఎపిసోడ్‌లో జయప్రదను ఆటపట్టిస్తూనే బాలకృష్ణ తనతోపాటు తన తండ్రి ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. జయప్రద, బాలకృష్ణ మధ్య సంభాషణ సరదా సరదాగా సాగిపోయింది.