OTTలోకి కామెడీ డ్రామా సిరీస్ కుమారి శ్రీమతి.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

అలా మొదలైంది అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిత్యమీనన్... వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ మధ్య గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. తర్వాత పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ధనుష్ తో కలిసి తిరు అనే సినిమాలో నటించి సూపర్ హిట్టును వేసుకున్న ఈ భామ... ఇప్పుడు ఓటీటీలో కొత్త సీరిస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

మలయాళ బ్యూటీ నిత్యామీనన్‌... తెలుగులో అలా మొదలైంది సినిమాతో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.... ఆ తర్వాత 'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.

 Actress Nitya Menon Kumari Srimathi

ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని అనుకున్న నేపథ్యంలో 'భీమ్లానాయక్‌', 'తిరు' సినిమాలతో మళ్లీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చంది. ప్రస్తుతం నిత్యామీనన్ చేతిలో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లేడి ఓరియెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి.

కుమారి శ్రీమతి వెబ్ సీరిస్ కు గోమతేష్ ఉపాధ్యాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి గ్లింప్స్‌ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ప్రముఖ నటి కీర్తి సురేష్ ఈ టీజర్ ను తన సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించింది.

టీజర్ గమనిస్తే... వయసు వచ్చినా పెళ్లి కాకుండా నిత్య మీనన్ అలాగే ఉంటుంది. నీకన్నా చాలా చిన్న పిల్ల దానికి పెళ్లి అయిపోయింది. నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్ అంటూ టీజ‌ర్ మొద‌లైంది. పెళ్లి గురించి అందరూ ఒత్తిడి చేస్తున్నా.. పెళ్లి బంధంలో చిక్కుకోకుండా.. స్వంత కాళ్లపై నిలబడి బిజినెస్‌ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఇంటిల్లిపాదిని సంతోషంగా చూసుకోవాలనే లక్ష్యం ఉన్న ఒక వీర వనిత పాత్ర‌లో నిత్య క‌నిపిస్తుంది.

ఇక ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో కుమారి శ్రీమతి సెప్టెంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్రకటించారు. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X