OTTలో అలరించిన థ్రిల్లర్ కామెడీకి సీక్వెల్.. కానీ ఈసారి థియేటర్లలో రిలీజ్!

ఓటీటీలో అలరించిన ఓ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అయితే ఇప్పుడు ఆ సీక్వెల్ మళ్లీ ఓటీటీలో రిలీజ్ కావడం లేదు. ఈసారి థియేటర్లలో అలరించనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రియమణి నటించిన భామా కలాపం సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా 2021లో కరోనా టైంలో వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఓటీటీలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందిస్తూనే ఉంటుంది ఆహా ఓటీటీ. అందులో భాగంగానే... విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం' మూవీ ఆహాలో డైరెక్టుగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఆహాలో సూపర్ సక్సెస్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియామణికి నటనా పరంగా మంచి క్రేజ్ లభించింది.

Actress Priyamani Bhama kalapam 2 to be Released in Theaters soon Full Details Here

ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా 'భామా కలాపం 2'ను తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో రెండో భాగాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇదొక మంచి విందులా ప్రేక్షకులను ఆకట్టుకుకునేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో 'భామా కలాపం 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది.

భామ కలాపం 2 సినిమాను రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌ తో ఆడియెన్స్‌ను అలరించనుందని తెలుస్తోంది. ఇంతకు ముందుకు ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామాకలాపం, విశ్వక్‌ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలను నిర్మించిన డ్రీమ్ ఫార్మర్స్ ఇప్పుడు 'భామా కలాపం 2'ను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కాకుండా.. థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఇది థియేటర్స్‌లో విడుదల కావటానికి రెడీ అవుతుంది.

డ్రీమ్ ఫార్మర్స్‌ తో పాటు ఆహా స్టూడియోస్ సంయుక్తంగా భామ కలాపం 2ను రూపొందిస్తోన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా... సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు.

ఇక భామకలాపం..ఓటీటీలో ఇప్పుడు దాని సీక్వెల్ భామ కలాపం 2 థియేటర్లలో రిలీజ్ అవ్వడం వెనుక ఇటీవల వచ్చిన పోలిమేర 2 ప్రభావం ఉందని అంటున్నారు నెటిజన్స్. పోలిమేర 1 డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయి ఆకట్టుకుంది. ఇక దానికి సీక్వెల్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది థియేటర్లలో రిలీజ్ అయి విజయవంతంగా కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది. ఇక ఈ మూవీ బాటలోనే భామ కలాపం 2ను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X