OTT: ఇంట్లో కూర్చునే శక్తి పీఠ దర్శనం.. ప్రియమణి కొత్త వెబ్ సిరీస్ చూశారా?
ఓటీటీ వేదికగా ఎన్నో కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పటి హీరో, హీరోయిన్లు.. ఓటీటీ వేదికగా సినిమాలు, సిరీసులు చేస్తున్నారు. కుర్ర హీరోలు, హీరోయిన్స్.. థియేటర్ల సినిమాలు చేస్తుంటే.. ఫేడ్ అవుట్ అయిన హీరోలు, హీరోయిన్లు మళ్లీ ఫాంలోకి వచ్చేందుకు ఓటీటీపై కన్నేశారు. ఇక తాజాగా మరో సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ తో రాబోతుంది. ఇప్పటికే భామ కలాపం వంటి డైరెక్టు ఓటీటీ మూవీస్ లో నటించిన ఈ భామ.. మరోసారి సర్వం శక్తిమయం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ ఒకప్పుడు స్టారీ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ... ఢీ వంటి కార్యక్రమాల్లో జడ్జ్ గా వ్యవహారించింది. ఇక అక్కడ జడ్జ్ మెంట్ ఇస్తునే.. తనదైన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

ఆ తర్వాత రానా సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమాలో నక్సలేట్ గా ప్రియమణి అద్భుతంగా నటించింది. ఇక అలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈ భామ.. మొన్న రిలీజ్ అయిన జవాన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ప్రియమణి ఓటీటీ వేదికగా ఓ వెబ్ సీరిస్ చేయబోతుంది. అయితే ప్రియమణికి ఓటీటీ కొత్తేమి కాదు.. ఇంతకు ముందు భామ కలాపం అనే సినిమాతో డైరెక్టు ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు ప్రియమణి.. సర్వం శక్తిమయం అంటూ వెబ్ సిరీస్ తో రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రియమణి, సంజయ్ సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించాడు. బివిఎస్ రవి కథ అందించారు. దానితో పాటు క్రియేటర్ గా వ్యవహరించారు. హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించారు. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని నిర్మాతలుగా వ్యవహారించారు. తాజాగా సర్వం శక్తిమయం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా కథ సాగుతుందని అంటున్నారు.

సర్వం శక్తిమయం వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయట. ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుంది... మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశక్తి పీఠాల మహత్యం చెప్పేలా వెబ్ సిరీస్ రానుందని చెబుతున్నారు మేకర్స్. ఈ సిరీస్ ద్వారా మొత్తం భారతదేశం లో ని 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ దసరాకు 'సర్వం శక్తి మయం' అనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మీరు ఇంట్లోనే కూర్చోని శక్తిపీఠాల దర్శనాన్ని చూసేయండి.


Click it and Unblock the Notifications











