Sai Pallavi: వేధింపులపై సాయి పల్లవి ఓపెన్ కామెంట్.. మీటూ గురించి చెబుతూ షాకింగ్ రియాక్షన్!

సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో సాయి పల్లవి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. పెద్దగా గ్లామర్ షో లేకుండా కేవలం తన యాక్టింగ్ స్కిల్స్ తోనే అలాగే డాన్స్ మూమెంట్స్ తో ఈ బ్యూటీ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే సాయి పల్లవి కూడా మీటూ విషయంలో స్పందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే..

స్పెషల్ ఫ్యాన్ ఫాలోవర్స్

స్పెషల్ ఫ్యాన్ ఫాలోవర్స్

సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. సాయి పల్లవి ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా ఏర్పడ్డారు.

అలాంటి వాటిని రిజెక్ట్

అలాంటి వాటిని రిజెక్ట్

ఇక సాయి పల్లవి కేవలం సినిమాలపైనే కాకుండా ఆమె సామాజిక అంశాలపై కూడా చాలా విభిన్నంగా స్పందిస్తూ ఉంటారు. ఆమెకు స్టార్ హోదా పెరిగినప్పటికీ కూడా ఎన్నడూ కమర్షియల్ యాడ్స్ లో నటించింది లేదు. ముఖ్యంగా బ్యూటీ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కు ప్రమోట్ చేయడానికి సాయి పల్లవి ఒప్పుకోలేదు. అలా అబద్దాలు చెప్పి మోసం చేయలేను అని ఆమె ఓపెన్ గా చెప్పేసింది. మొత్తంగా ఆ రూట్లో సాయి పల్లవి 10 కోట్ల విలువ కలిగిన ఆఫర్స్ ను మిస్ చేసుకుంది.

నచ్చకపోతే..

నచ్చకపోతే..

సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళంలో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె రొటీన్ కమర్షియల్ సినిమాలు అలాగే రీమేక్ సినిమాలో చేయడానికి ఒప్పుకోదు. మెగాస్టార్ చిరంజీవితో బోలా శంకర్ సినిమాలో సోదరి పాత్ర చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా రీమేక్ కాబట్టి చేయను అని ఓపెన్ గా చెప్పేసింది. అలాగే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కథలు కూడా నచ్చకపోతే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

 మీటూ పై సాయి పల్లవి రియాక్షన్

మీటూ పై సాయి పల్లవి రియాక్షన్


అయితే గతంలో చాలామంది హీరోయిన్స్ మీటూ అంటూ వివిధ రకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారికి ఎదురైనా ఎన్నో చేదు అనుభవాలను కూడా మీటు హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో అది ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ విషయంపై సాయి పల్లవి కూడా చాలా సున్నితంగా స్పందించే ప్రయత్నం చేశారు. ఇటీవల ఒక టాక్ షోలో ఆమె ఆ విషయం గురించి మాట్లాడింది.

 అలా చేయడం తప్పే అవుతుంది

అలా చేయడం తప్పే అవుతుంది

ఇటీవల సాయి పల్లవి, సింగర్ స్మిత హోస్ట్ గా ఉన్న నిజం అనే టాక్ షోలో పాల్గొన్నారు. ఇక అందులో ఆమె మీటూ ఉద్యమం సమయంలో మీ భావన ఏంటి అనే దానిపై ఎలా స్పందిస్తారు అనే విషయం గురించి సాయి పల్లవిని అడిగారు. ఇక అందుకు సాయి పల్లవి శారీరక వేధింపులకు గురి చేయకపోయినప్పటికీ కూడా మాటలతో ఇబ్బంది పెట్టినా కూడా.. అది వేధింపులకు కిందకు వస్తుంది అని అలా చేయడం కూడా తప్పేనని సాయి పల్లవి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X