బిగ్‌బాస్‌ షోలో చిగురించిన లవ్ అఫైర్‌కు బ్రేక్.. బాయ్‌ఫ్రెండ్‌కు షమితా శెట్టి గుడ్‌బై.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్, శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి ప్రియుడికి గుడ్‌బై చెప్పింది. గతకొద్దికాలంగా తన బాయ్‌ఫ్రెండ్ రాకేష్ బాపట్‌తో విడిపోతున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరేలా తన బ్రేకప్‌ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. షమితా శెట్టి బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 43 ఏళ్ల వయసులో మరోసారి బ్రేకప్ కావడం బాలీవుడ్ వర్గాల్లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. షమితాశెట్టి బ్రేకప్ గురించిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఓటీటీలో ప్రేమాయణం

బిగ్‌బాస్ ఓటీటీలో ప్రేమాయణం

షమితా శెట్టి లవ్ అఫైర్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ ఓటీటీ షోలో వారి ప్రేమాయణం మొదలైంది. ఈ షోలో రాకేష్ బాపట్‌, షమితా శెట్టి మధ్య బాండింగ్ ఏర్పడింది. వారి మధ్య స్పెషల్ మూమెంట్స్ ఏర్పడటంతో వారిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు. బిగ్‌బాస్ షోలో తోటి కంటెస్టెంట్లతో గొడవలు జరిగినప్పుడు రాకేష్ బేషరుతుగా అండగా నిలిచాడు. దాంతో వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది.

బిగ్‌బాస్‌లో ట్రాయంగిల్ లవ్ స్టోరి

బిగ్‌బాస్‌లో ట్రాయంగిల్ లవ్ స్టోరి

అయితే బిగ్‌బాస్ ఓటీటీ షోలో రాకేష్‌, షమితా శెట్టి, సింగర్ నేహా భాసిన్ మధ్య ట్రాయంగిల్ లవ్ స్టోరి జరిగింది. రాకేష్‌ను షమితా ప్రేమిస్తే.. అదే సమయంలో రాకేష్‌ను నేహా కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. ఓ దశలో నేహాతో తన ప్రేమ విషయాన్ని షమితా పంచుకోవడం ఓ ట్విస్టుగా మారింది. అయితే మీరిద్దరు నిజంగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారా అని నేహా అడిగింది. రాకేష్ అంటే నాకు ఇష్టం. నేనంటే రాకేష్‌ కూడా ఇష్టమే. కానీ మేమింకా మనసు విప్పి మాట్లాడుకోలేదు అంటూ షమితా చెప్పింది.

ఫ్రెంచ్ భాషలో ఐలవ్ యూ చెప్పి

ఫ్రెంచ్ భాషలో ఐలవ్ యూ చెప్పి

బిగ్‌బాస్ ఓటీటీ షో రంజుగా, వివాదాల మధ్య కొనసాగుతుండగా.. షమితా శెట్టికి రాకేష్ తన లవ్ ప్రపోజల్‌ను తెలిపాడు. అయితే వెంటనే షమితా ఒప్పుకోకుండా.. నా గురించి నాలుగు మంచి విషయాలు చెప్పమంటే.. చాలా సమయం తీసుకొని.. ఫ్రెంచ్ భాషలో ఐలవ్ యూ అని చెప్పాడు. దాంతో వారి మధ్య బిగ్‌బాస్ షో సాక్షిగా ప్రేమ చిగురించింది.

బిగ్‌బాస్ 15లో రొమాంటిక్‌గా

బిగ్‌బాస్ 15లో రొమాంటిక్‌గా

బిగ్‌బాస్ ఓటీటీ తర్వాత లవ్ అఫైర్ జోరుగా కొనసాగుతుండగానే.. షమితా బిగ్‌బాస్ సీజన్ 15లోకి అడుగుపెట్టింది. షమితాకు బయట నుంచి రాకేష్ మద్దతు తెలుపుతున్న సమయంలో.. ఆయనకు కూడా షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. అయితే షోలో ఉండగా కిడ్నీ పెయిన్ కారణంగా రాకేష్ ఎక్కువ రోజులు ఉండకుండానే బయటకు వచ్చాడు.

రాకేష్ బాపట్‌తో విడిపోయా అంటూ

రాకేష్ బాపట్‌తో విడిపోయా అంటూ

అయితే 2022లో షమితా, రాకేష్ బాపట్ విడిపోయారనే రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే వాటిని షమితా ఖండించింది. అయితే తాజాగా రాకేష్ బాపట్‌ తాను విడిపోయాం అని స్పష్టం చేసింది. మేమిద్దరం ఇక ముందు కలిసి ఉండలేం. కానీ మేమిద్దరం నటించిన మ్యూజిక్ వీడియో త్వరలోనే విడుదల అవుతుంది. మా మ్యాజిక్ వీడియోను అభిమానులు సపోర్ట్ చేయాలని కోరుకొంటున్నాను. వ్యక్తిగతంగా మా ఇద్దరిపై గతంలో చూపించిన ప్రేమను ఇక ముందు కూడా చూపించండి అని ఫ్యాన్స్‌ను కోరింది.

షమితా శెట్టి కెరీర్ ఇలా..

షమితా శెట్టి కెరీర్ ఇలా..

షమితా శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో అమితాబ్, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ నటించిన మొహబ్బతే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో రాజ్యం, ఆ తర్వాత పిలిస్తే పలుకుతా అనే తెలుగు సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X