OTTలోకి రాబోతున్న రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. ఆదా శర్మ నక్సలైట్‌గా కనిపించిన దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మరీ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా అనేక హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతల అదిరిపోయే క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలను అందుబాటులోకి తీసుకువస్తూ సూపర్ హిట్ లు కొడుతున్నారు. అయితే ఇటీవలే థియేటర్లలో విడుదల అయిన ఓ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆదా శర్మ నక్సలైట్ గా కనిపించిన ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ది కేరళ స్టోరీ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఆ సినిమా డైరెక్టర్ తెగ ఖుషీ అయిపోయారు. ముఖ్యంగా హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సక్సెస్ చూసిన ఈ కాంబో ఆ తర్వాత మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా పేరే "బస్తర్: ది నక్సల్ స్టోరీ". సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.

అలాగే ఈ బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమాలో ఆదా శర్మ లీడ్ లో కనిపించి మెప్పించింది. ఆమెతో పాటు ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, శిల్పా శుక్లా, యశ్‌పాల్ శర్మ, సుబ్రత్ దత్తా, రైమా సేన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాటు ఆధారంగా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సుదీప్తో సేన్. అయితే ఈ సినిమా టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచే ఈ చిత్రంపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ది కేరళ స్టోరీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతుందని అంతా అనుకున్నారు.
ఇలా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 25వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ముఖ్యంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. 15 కోట్ల పెట్టి నిర్మచింన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కనీసం 3 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇలా ఫ్లాపుగా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని నేరుగా జీ5 సంస్థనే ఎక్స్ వేదికగా ప్రకటించింది. మే 17వ తేదీన నుంచి ఆదా శర్మ కీలక పాత్రలో కనిపించిన బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమా జీ5 వేదికగా అందుబాటులో ఉండబోతుందని వివరించింది. మరి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు కూడా ఓటీటీ వేదికగా చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











