The Kerala Story OTT: వివాదాస్పదంగా ది కేరళ స్టోరీ.. థియేటర్లలో షోలు రద్దు.. నేరుగా ఆ ఓటీటీలోకి!
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన బ్యూటి అదా శర్మ. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈ బ్యూటి తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా పేరు రాలేదు. దీంతో హిందీలో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే ఆమె తాజాగా నటించిన చిత్రం ది కేరళ స్టోరి (The Kerala Story). ఈ సినిమా ట్రైలర్ నుంచే వివాదాలు వెంటాడాయి. ఎన్నో విమర్శల నడుము విడుదలైన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఆసక్తికరంగా మారాయి.

అనేక వివాదాలు: ఇటీవల ట్రైలర్ నుంచి వివాదాలకు గురైన సినిమా ది కేరళ స్టోరి. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హార్ట్ ఎటాక్ బ్యూటి ఆదా శర్మ నటించింది. ఆమెతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విపుల్ అమృతలాల్ షా నిర్మించిన ఈ సినిమాకు ట్రైలర్ నుంచి థియేటర్ రిలీజ్ వరకు అనేక వివాదాలు ఎదురయ్యాయి.

3 రోజుల్లోనే అన్ని కోట్లు: అత్యంత విమర్శల నడుమ మే 5న విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా సుమారుగా రూ. 36 కోట్ల గ్రాస్ వసూళు చేసి రికార్ట్ క్రియేట్ చేసింది. అయితే అత్యంత వివాదాస్పదంగా మారిన ది కేరళ స్టోరి (The Kerala Story Controversy)సినిమాను తమిళనాడులోని వివిధ మల్టీప్లెక్స్ లు షోలను రద్దు చేశాయి.

ఓటీటీ రైట్స్: చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు పలు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షోలు క్యాన్సిల్ చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని గత కొద్దిరోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ది కేరళ స్టోరీ ప్రదర్శించే థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లీం సంఘాలు హెచ్చరించాయి. ఇలా నిరసనల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఆసక్తికరంగా మారాయి.

థియేట్రికల్ తర్వాత: ది కేరళ స్టోరీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జీ5 (Zee5) భారీ ధరకు కొనుగోలు చేసిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అంతేకాకుండా దీన్ని థియేట్రికల్ విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్. అంటే జూన్ మూడో వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి దించాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దాదాపు 32 వేల మంది: ది కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మత మార్పిడి కథా నేపథ్యంగా తెరకెక్కింది. కేరళకు చెందిన వేలాది మంది అమ్మాయిలను ఐసీస్ (ISIS) ఇస్లాం మతంలోకి మార్చరనే విషయాన్ని ది కేరళ స్టోరి సినిమాలో చూపించడం సంచలనంగా మారింది.
దీంతో సినిమాపై వివాదం రాజుకుంది. దాదాపు 32 వేల మంది కేరళ మహిళలు మత మార్పిడి చేసుకున్నారని, తర్వాత సినిమా కోసం కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే క్లెయిమ్ ని మార్చుకున్నారని మేకర్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications











