OTTలోకి వచ్చేసిన 250 కోట్ల కాంట్రవర్షియల్ మూవీ... అస్సలు మిస్ అవ్వొద్దు!

ఎట్టకేలకు ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం వచ్చేసింది. దేశం మొత్తం సంచలనం సృష్టించిన చిత్రం ది కేరళ స్టోరీ. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు 9నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రియల్ ఇన్సిడెంట్ స్టోరీలో ఆదా శర్మ కీలక పాత్రలో నటించగా... సూదీప్తో సేన్ ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మే 5న 2023లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. ఎందుకు వివాదాస్పదం అయిందనే వివరాలు ఈస్టోరీలో చూసేద్దాం.

హార్ట్‌ ఎటాక్‌ బ్యూటీ ఆదాశర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ అటాక్ సినిమాలో నటించింది. నితిన్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకులకు తన అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఇక ఈ భామ గత ఏడాది కీలక పాత్రలో నటించిన సినిమా ది కేరళ స్టోరీ. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించాడు.

Adah Sharma The Kerala Story Movie Now Streaming on ZEE5 OTT Full Details Here

ది కేరళ స్టోరీ విడుదలకు ముందే ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను ఎదుర్కొంది. ఇక 2023 సంవత్సరంలో మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో రిలీజయ్యాక సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏకంగా బ్యాన్ చేశారు. తమ రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రదర్శించమని అక్కడి ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. ఈ సినిమాపై నిషేధం విధించారు.

ఇక రెండు రాష్ట్రాలు బ్యాన్ చేసేంతంగా ఏముందని ఈ సినిమాపై అందరి ఫోకస్ పడింది. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపును అనౌన్స్ చేశారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలవగా... ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రదర్శనపై గొడవలు తలెత్తాయి. పలు చోట్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలని అనుకున్నారు. ఇలా మొత్తానికి ది కేరళ స్టోరీ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుని సంచలనం సృష్టించింది.

Adah Sharma The Kerala Story Movie Now Streaming on ZEE5 OTT Full Details Here

అయితే దేశం మొత్తం సంచలనం సృష్టించిన ఈ సినిమాకు మాత్రం కలెక్షన్లు భారీగా వచ్చాయి. మే 5న విడుదలైన ఈ మూవీకి లాంగ్‌ రన్‌ లో ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో అదరగొట్టి... అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్‌ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ది కేరళ స్టోరీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ది కేరళ స్టోరీ సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించగా... సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించారు. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రాల్లో నటించారు. మరి ఈ సూపర్ హిట్ కాంట్రవర్షియల్ సినిమాను మీరు థియేటర్లలో మిస్ అయితే.. ఓటీటీలో ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X