తెరపై దెయ్యం ఇంట్లోకి వస్తే .. ఓటీటీలోకి అదా శర్మ సస్పెన్స్ థ్రిల్లర్ , తట్టుకోగలరా మరి?

ఓటీటీల రాకతో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోని ఒరిజినల్ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్, క్రైమ్, సస్పెన్స్, కామెడీ ఇష్టపడే వారికి ఓటీటీలకు బెస్ట్ ఫ్లాట్‌ఫాంగా మారాయి. ఇలాంటి వారి కోసం ఓటీటీ కంపెనీలు అలాంటి కంటెంట్‌ను వెతికిమరి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా అందాల భామ అదా శర్మ నటించిన సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్ ) ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

తన అందం, అభినయంతో వెలిగిపోతుందనుకున్న అదా శర్మ.. తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైపోయింది. తర్వాత ఆమె ఏమైందో కూడా ఎవరికీ తెలియరాలేదు. ఈ క్రమంలో ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత తెలుగులో అదా శర్మ నటించిన సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్‌లతో ఇవి మరింత పెరిగాయి.

adah sharma s Crime thriller movie CD ott release confirmed here s the details

అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, మహేశ్ విట్టా తదితరులు నటించిన సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్)కి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు. ఎస్ఎస్‌సీఎం ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మే 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ సినిమా మేకింగ్, కథనం, టెక్నికల్ స్టాండర్డ్స్ బాగున్నట్లుగా విమర్శకులు పేర్కొన్నారు.

దెయ్యాలంటే భయపడే సిద్దు (విశ్వంత్)కు ఓ రోజున అమ్మానాన్నలు వేరే ఊరికి వెళ్లాల్సి రావడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఆ సమయంలో డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి మరింత వణికిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసే సైకో రక్ష (అదా శర్మ) అందరిని భయపెడుతుంది. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ ఒక్కొక్కరిని కిడ్నాప్ చేస్తుంది. ఈ క్రమంలో విశ్వంత్ కోసం వచ్చి అతని ఇంట్లోనే ఉంటుంది. సిద్దూకి రక్షకి సంబంధం ఏంటీ? రక్ష ఎందుకు కిడ్నాప్‌లు చేస్తుంది? రక్ష పోలీసులకు దొరుకుతుందా? సిద్ధూ అసలు ఎందుకు భయపడుతున్నాడు? అన్నదే సీడీ కథ.

adah sharma s Crime thriller movie CD ott release confirmed here s the details

ఎప్పుడో సమ్మర్ కానుకగా వచ్చిన సీడీ ఓటీటీలోకి రావడానికి లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అక్టోబర్ 26 నుంచి సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆహా రిలీజ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూసేయండి మరి.

More from Filmibeat

Read more about: c d ott news adah sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X