OTTలోకి పొట్టచెక్కలయ్యేలా నవ్వించే మూవీ.. ఈ రీసెంట్ మూవీని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే చిత్రాలు ఓటీటీ వేదికగా వస్తూ.. తెగ సందడి చేస్తున్నారు. వీక్ స్టార్ట్ అవుతుందన్నా, వీకెండ్ వస్తుందన్నా అంతా ఓటీటీలో వచ్చే సినిమాలు ఏమున్నాయి, ఏవేవి చూడాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హార్రర్, కామెడీ, క్రైమ్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఓటీటీలో అదిరిపోయే కామెడీ చిత్రాలు ఉండగా.. తాజాగా మరో సినిమా వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక సినిమాల్లో క్యారెక్టర్ రోల్ చేసిన అదిత్ అరుణ్ హీరోగా మారి.. ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ అద్భుతమైన కామెడీ మూవీయే లైన్ మ్యాన్. కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల అయిన ఈ సినిమా అందరికనీ ఆకట్టుకునే విధంగానే ఉంది. రఘు శాస్త్రి రచించిన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదిత్ అరుణ్.. త్రిగుణ్ గా పేరు మార్చుకున్నారు. అలాగే ఈయన సరసన బి. జయశ్రీ నటించి మెప్పించారు. పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న ఈ చిత్రాన్ని నిర్మించారు.

శాంతి సాగర్ హెచ్ జీ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ సినిమాకు ఎల్. రఘునాథ ఎడిటర్ గా పని చేశారు. కాజల్ కుందర్, జయశ్రీ, హరిణి శ్రీకాంత్, అంజలి, చేతన్ గంధర్వ, గౌరవశెట్టి, దిలీప్ కెంపేగౌడ, సందీప్ కెంపేగౌడ, సుహైల్ మసూద్, మైకో నాగరాజ్, నివిక్ష నాయుడు, సుజయ్ సాస్త్రి, అపూర్వ శ్రీ, శ్రీదత్తా వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మార్చి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిల్లో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.
కానీ ఐఎండీబీ.. 8 రేటింగ్ ఇవ్వడంతో.. అందరికీ ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అనేక ఓటీటీలు ఉండగా.. ఇది కేవలం కన్నడ లోకల్ ఓటీటీలో మాత్రమే విడుదల అయింది. తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగులో ఓటీటీలోకి తీసుకరాకపోవడం గమనార్హం. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు తెలుగులో అందుబాటులోకి వస్తుందనేది. మీరు కూడా ఓసారి ఓ మూవీని ఓటీటీ వేదికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











