Major Movie OTT Release Date: ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే.. రిజల్ట్ లో తేడా వస్తే ముందుగానే?
2008 ముంబై లోని ఉగ్ర దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మేజర్ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా మేజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video


పది రోజుల ముందే
టాలెంటెడ్ నటుడు అడవి శేష్.. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి అతను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పది రోజుల ముందే ఈ సినిమాను కొన్ని ముఖ్యమైన సిటీస్ లలో కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడే సినిమాకు మంచి టాక్ లభించింది.

అన్ని రకాల ఎమోషన్స్..
ఇక ఓవర్సీస్లో ప్రీమియర్ షోలకు కూడా భారీ స్పందన రావడంతో సినిమా సక్సెస్ అని మొదటి రోజే చాలా క్లారిటీగా అర్ధమైపోయింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని కూడా అనిపిస్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ముంబై దాడుల్లో ఎలా వీరమరణం పొందాడు అనే విషయాన్ని మాత్రమే కాకుండా అతని బాల్యం ప్రేమ ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా సినిమాలో హైలెట్ చేయబోతున్నారు.

మహేష్ బాబు ప్రమోషన్స్
సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దానికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మించడమే కాకుండా ప్రమోషన్ లో కూడా చాలా ప్రత్యేకంగా పాల్గొన్నాడు. దీంతో సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో అయితే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ ప్రీమియర్ షోల ద్వారా నార్త్ ఇండస్ట్రీ లో కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది

పక్కా హిట్టు బొమ్మ
మొత్తానికి మేజర్ సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా రిజల్ట్ విషయంలో అయితే ఏమాత్రం అనుమానాలు లేవని ట్రైలర్ సాంగ్స్ కు వచ్చిన రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ లో కూడా బలమైన నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది అని ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అని ధీమాతో ఉన్నారు.

ఓటీటీ రిలీజ్?
అయితే మేజర్ సినిమా థియేట్రికల్ గా భారీగానే విడుదల అవుతుండగా ఇక ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు? ఓ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారనే విషయం లో మాత్రం అఫీషియల్గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ ఎప్పటిలానే ముందుగా నిర్మాతలతో చర్చలు జరిపింది. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఎప్పుడు రావచ్చు?
ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అయితే పక్కాగా రిలీజ్ అని క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఒప్పందం ప్రకారం 50 రోజుల థియేట్రికల్ రిలీక్ అనంతరం జూలై మూడో వారంలోనే మేజర్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా రిజల్ట్ అనుకున్నట్లుగా ఉంటేనే. లేకపోతే కలెక్షన్స్ తగ్గితే మాత్రం అంతకంటే ముందే రావచ్చు అనే సమాచారం.


Click it and Unblock the Notifications











