Unstoppable 2: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ తో బాలకృష్ణ దబిడి దిబిడి.. మరోసారి యంగ్ హీరోలు
డ్యాన్స్ లు, ఫైట్ లతో సినిమాలతో చెలరేగిపోతాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే బాలయ్య బాబు డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నాయి. మొదటి ఎపిసోడ్ ను ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన నారా చంద్రబాబుతో ప్రారంభించి వ్యూస్ పరంగా రికార్డ్ నెలకొల్పారు. రెండో ఎపిసోడ్ లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. ఇప్పుడు తాజాగా మూడో ఎపిసోడ్ కు మరో ఇద్దరు యంగ్ హీరోలు హాజరై అలరించనున్నారు. ఆ వివరాళ్లోకి వెళితే..
అక్టోబర్ 14వ తేదీన..
నందమారి బాలకృష్ణ ఆరు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. అందుకే ఉదాహరణే బాలకృష్ణ హోస్ట్ గా మారిన 'Unstoppable with NBK' అనే టాక్ షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. ఇది సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు. ఈ 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన స్ట్రీమింగ్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చి రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది.
ఫిట్టింగ్ లు పెట్టడంతో..
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్ ఊపుతో రెండో ఎపిసోడ్ ను కూడా విడుదల చేసింది. ఈ రెండో ఎపిసోడ్ లో తెలుగు ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరై అలరించారు. వీరితో పోటాపోటీగా నటసింహం బాలకృష్ణ జోష్ చూపించారు. ఈ యంగ్ హీరోలతో బాలయ్య ఓ రేంజ్‌లో సందడి చేశారు. మరీ ముఖ్యంగా కుర్ర హీరోలకు షాకిచ్చేలా ఆయన తనదైన హోస్టింగ్ అలరించారు. వాళ్ల బ్రేకప్ లు, పెద్ద అవమానాలు, గొప్ప నిర్ణయాలు తదితర ఆసక్తికర విషయాలతో ఎపిసోడ్ ను రక్తికట్టించారు బాలయ్య బాబు. అంతేకాకుండా షోలో బాలయ్య బాబు బూతు మాట్లాడటం, వాళ్లిద్దరి మధ్య ఫిట్టింగ్ లు పెట్టడంతో ఈ ఎపిసోడ్ కూడా సక్సెస్ అయింది.
దబిడి దిబిడి కొనసాగుతుంది..
ఇప్పుడు 'Unstoppable 2' మూడో ఎపిసోడ్ కూడా రానుంది. ఈ ఎపిసోడ్ కు మరోసారి యంగ్ హీరోలు రానున్నారు. మూడో ఎపిసోడ్ కు ఎవరు రానున్నారని సోషల్ మీడియా వేదికగా పోటీ కూడా నిర్వహించారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని క్లూలు కూడా వదిలారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వాళ్లెవరో ప్రకటించింది ఆహా. బాలయ్య హోస్టింగ్ తో రచ్చ చేస్తున్న 'Unstoppable 2' మూడో ఎపిసోడ్ కు అడివి శేష్, శర్వానంద్ హాజరు కానున్నారు. ''టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ తో దబిడి దిబిడి కొనసాగుతుంది'' అని ట్వీట్ చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ నవంబర్ లో స్ట్రీమింగ్ కానుంది. అడివి శేష్, శర్వానంద్ ఇద్దరూ తమ టాలెంట్ తో తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరితో బాలయ్య బాబు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











