ఊర్వశి రౌతేలాకి అన్యాయం.. డాకు మహారాజ్‌ నుంచి ఔట్.. వివాదంపై నెట్ ఫ్లిక్స్?

దక్షిణాది సినిమా దగ్గర హిందీ సినిమా నుంచి వచ్చిన నటులకి ఎప్పుడు నుంచో ఎలాంటి ఆదరణ ఉంటుందో తెలిసిందే. కాగా ఇలా నార్త్ నుంచి సౌత్ లోకి మెయిన్ గా మన తెలుగులోకి వచ్చి అదరగొట్టిన కొందరు హాట్ బ్యూటీస్ లో చెక్కినట్టు కనిపించే అందాల భామ ఊర్వశి రౌతేలా కూడా ఒకామె అని చెప్పాలి. కాగా ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా హిందీలో పలు సినిమాలు చేసింది కానీ మన తెలుగులో మాత్రం హాట్ ఐటెం భామగానే మంచి ఫేమ్ అందుకుంది.

ఇలా మెగాస్టార్ చిరంజీవితో చేసిన భారీ హిట్ చిత్రం "వాల్తేరు వీరయ్య"తో ఓయెద్ద బ్రేక్ అందుకొని తెలుగులో యమ బిజీగా మారిపోయింది. కాగా ఇన్నేళ్లు పలు చిత్రాల్లో కేవలం ఐటెం గర్ల్ గా మాత్రమే కనిపించిన ఊర్వశి తెలుగులో తన డెబ్యూ సినిమా నటిగా కూడా ఇచ్చేసింది.

again urvashi rautela got ignored but netflix corrected this

కాగా ఏదైతే వాల్తేరు వీరయ్యతో మంచి బ్రేక్ అందించాడో అదే దర్శకుడు కొల్లి రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ తో ఆమెని ఈసారి ఐటెం సాంగ్ కి మాత్రమే పరిమితం చేయకుండా నటిగా కూడా అవకాశం అందించారు. కాగా ఈ సినిమాలో ఎక్కువ సేపు అది కూడా మంచి రోల్ నే చేసుకున్న ఊర్వశి రౌతేలాని కొన్ని విషయాల్లో మాత్రం మేకర్స్ ఆమెని పక్కన పెట్టడం జరిగింది.

మొదట్లో ఆమె సినిమాలో పోలీస్ రోల్ చేస్తున్నా అని ముందే లీక్స్ ఇచ్చేసింది. కానీ తర్వాత మేకర్స్ ఆమెని అఫీషియల్ పోస్ట్ లలో కూడా ట్యాగ్ చేయడం మానేశారు. దీనితో ఒక టైం లో సినిమాలో ఆమె లేదు అనే మాట కూడా రాకపోలేదు. ఫైనల్ గా సాంగ్ కి మాత్రం పరిమితం చేసి ఆమెని లిమిట్స్ లోనే ఉంచుతున్నారు అని అనిపించింది.

again urvashi rautela got ignored but netflix corrected this

కాగా సినిమా వచ్చాక అలాంటిది ఏమి లేదు ఊర్వశి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇపుడు డాకు మహారాజ్ ఓటిటిలో వస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై ఈ సినిమా సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఓ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో అందరినీ పెట్టారు కానీ ఆమెని మాత్రం పెట్టలేదు. దీనితో సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. మెయిన్ గా హిందీ ఆడియెన్స్ ఊర్వశి రౌతేలా మిస్సింగ్ ని బాగా అబ్జర్వ్ చేస్తుండగా నెట్ ఫ్లిక్స్ పై కూడా పలు ట్రోల్స్ వచ్చాయి.

దీనితో ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ వారు అది గమనించి మళ్ళీ ఆమె పిక్ నే మొదట్లో పెట్టి ఓ పోస్ట్ పెట్టారు. దీనితో సోషల్ మీడియా ఎఫెక్ట్, ఊర్వశి ఫ్యాన్స్ ఎఫెక్ట్ బాగానే పని చేసింది అని నేషనల్ మీడియా కూడా అంటున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది.

More from Filmibeat

Read more about: urvashi rautela bobby balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X