Agent OTT రిలీజ్‌పై రూమర్లు.. అఖిల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం ఎందుకంటే? నిర్మాత క్లారిటి
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా బోల్తా పడింది. అయితే ఆ డిజాస్టర్‌ను మరిచిపోయే విధంగా అనిల్ సుంకర్ ప్రస్తుతం సామజవరగమన సినిమాతో భారీ హిట్ కొట్టడం తెలిసిందే. అయితే ఏజెంట్ ఓటీటీ రిలీజ్‌పై ఆయన క్లారిటీ ఇస్తూ..
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మేము తీసిన మహాసముద్రం, ఏజెంట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమాలు మేము మా బ్యానర్‌లో తీయాల్సిన మూవీ కాదు. ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి, సురేందర్ రెడ్డి తప్పేమీ లేదు. వాళ్లు చెప్పిన విధంగా సినిమాను తీశారు. మా జడ్జిమెంట్ తప్పయింది. లవ్ స్టోరీలు, స్పై థ్రిల్లర్స్ తీయాల్సింది కాదు అనే అభిప్రాయం ఆ మూవీ ఫ్లాప్ తర్వాత తెలిసింది అని అనిల్ సుంకర చెప్పారు.

ఏజెంట్ విషయంలో మాకు పక్కా స్క్రిప్టు ఉంటే ఫలితం మరోలా ఉండేది. బైండ్ స్క్రిప్టు లేకుండా సినిమా చేయడం మాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఇక నుంచి స్క్రిప్టు లేకుండా సినిమా చేయకూడదని మాకు ఈ అనుభవం నేర్పింది. ఇక నుంచి జాగ్రత్త పడుతామని అనిల్ సుంకర అన్నారు.
అయితే ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడం వెనుక ఎలాంటి కారణం లేదు. ప్రస్తుతం మేము సోని లివ్ ఓటీటీకి అమ్మి వేశాం. ఇక మా చేతుల్లో ఏమి లేదు. ఓటీటీలో వాళ్లు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకొన్నది వారి ఇష్టం. మా వద్ద ఫీడ్ ఉంది. వారికి హ్యాండవర్ కూడా ఇచ్చేశాం అని అనిల్ సుంకర చెప్పారు.
ఓటీటీలో ఏజెంట్ రిలీజ్‌కు ముందు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారనే వార్తలను నిర్మాత అనిల్ సుంకర ఖండించారు. కంటెంట్ మా వద్ద ఉంది. ఎడిటింగ్ జరుగుతున్నదనే వార్తలు అబద్దం. ఏజెంట్ ఓటీటీ రిలీజ్‌పై వచ్చే వార్తలన్నీ అవాస్తవాలే అని అనిల్ సుంకర స్పష్టత ఇచ్చారు.
ఇక ఏజెంట్ సినిమా ఓటీటీ హక్కులను సోని లీవ్ సొంతం చేసుకొన్నది. అయితే ఆ సినిమాను మే 19న స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ మే 19 తేదీన స్ట్రీమింగ్ కాకపోవడంతో అనేక రూమర్లు వస్తున్నాయి. అయితే సోనీ లివ్‌లో ఏజెంట్ ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











