1970లో ఆ ఊరిలో ఏం జరిగింది.. ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్, ఎందులో అంటే?

క్రైమ్, హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్‌కు ఎప్పుడూ గిరాకీయే. వీటికి సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ తరహా సినిమాలొస్తే ఖచ్చితంగా మినిమం గ్యారెంటీ అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. అందుకే అప్పుడప్పుడూ ఈ తరహా సినిమాలు మన తెలుగువాళ్లు కూడా తీస్తుంటారు. ఓటీటీల రాకతో కంటెంట్ తీరు పూర్తిగా మారిపోయింది. అరచేతిలోకి సినిమా వచ్చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న సినిమాలను చూసేందుకు వీలు కలుగుతోంది.

లైమ్ లైట్‌లోకి కన్నడ ఇండస్ట్రీ

ఓ మూలకి విసిరేసినట్లు ఎక్కడో ఉండే కన్నడ చిత్ర పరిశ్రమ కేజీఎఫ్, కాంతార చిత్రాలతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. నాటి నుంచి కన్నడ మేకర్స్ కూడా తమ పంథా మార్చి ఆకట్టుకునే కథ, కథనాలు ఉంటే సినిమాలు తీస్తున్నారు. ఓటీటీల రాకతో కన్నడ సినిమా పరిశ్రమ కూడా ఈ థ్రిల్లర్ జోనర్స్‌పై ఫోకస్ పెట్టి ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ఓ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అది ఏ సినిమా? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? ఈ వివరాలు చూస్తే..

Agnyathavasi OTT Release here is the Rangayana Raghu and paavana gowda s Movie ott streaming details

క్రైమ్ థ్రిల్లర్‌గా అజ్ఞాతవాసి

జనార్ధన్ చిక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం క్రైమ్ డ్రామాగా, మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చింది. రంగనాయన రఘు, పావన గౌడ, శరత్ లోహితాశ్వ, రవిశంకర్ గౌడలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దాక్షాయణి టాకీస్ బ్యానర్‌పై హేమంత్ ఎం రావు, ప్రచుర పీపీ, జయలక్ష్మీలు నిర్మించారు. ఈ చిత్రానికి సీనియర్ నటుడు చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా పనిచేయడం విశేషం. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందించారు. చిక్కమగళూరు, మడికెరి, మలెనాడు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. 50 ఏళ్లు వెనక్కి వెళ్లడానికి అనుగుణంగా సెట్స్ విషయంలో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఉల్లాస్ హైదర్ ఈ విషయంలో కీలకపాత్ర పోషించారు. 11 ఏప్రిల్ 2025న ఈ చిత్రం కన్నడ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

1970లో ఆ ఊరిలో ఏం జరిగింది

25 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో అనూహ్యంగా ఈ ఊరిపెద్ద దారుణ హత్యకు గురవుతాడు. ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? 1970లలో ఈ గ్రామంలో ఏం జరిగింది? హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారా? లేదా? అన్నదే అజ్ఞాతవాసి సినిమా కథ. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. థియేట్రిల్ రన్ ముగిసేసరికి ఇండియా వైడ్ 59 లక్షల రూపాయల నెట్, రూ.64 లక్షల నెట్ వసూళ్లు సాధించింది.

అజ్ఞాతవాసి స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సస్పెన్స్‌కు తెరదించింది. థియేటర్‌లో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అజ్ఞాతవాసి సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 28 నుంచి తెలుగు, కన్నడ భాషలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని జీ 5 అధికారికంగా ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X