For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  AHA Gold లోగోను ఆవిష్కరించిన కలర్ ఫోటో టీమ్.. కొత్త అనుభూతి కోసం ఆహా ప్రీమియమ్ అప్ గ్రేడ్

  |

  తెలుగు ఓటీటీ మాధ్యమాల్లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న ఆహా.. తాజాగా ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రీమియం వార్షిక స‌బ్‌స్క్రిప్ష‌న్‌లో భాగంగా యూజర్లకు హై క్వాలిటీలో 4K అల్ట్రా హెచ్‌డీ వీడియోల‌ను స్ట్రీమింగ్ ద్వారా అందించ‌నుంది. డాల్బీ సౌండ్‌లో క‌స్ట‌మ‌ర్‌కు అద్భుత‌మైన థియేట్రికల్ అనుభూతిని అందించనున్నది. వార్షిక స‌బ్‌స్క్రిప్ష‌న్‌లో ఉన్న‌వారంద‌రూ ఇప్పుడు ఆహాలో కొత్త‌గా రిలీజ్ అవుతోన్న సినిమాలు, టీవీ షోస్‌, ఓరిజిన‌ల్ కంటెంట్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో వీక్షించ‌వ‌చ్చు. ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్‌ను వీక్షించేలా క‌స్ట‌మ‌ర్స్ సౌలభ్యాన్ని, ప్రాధాన్య‌త‌ను గుర్తించి దాన్ని మ‌రింత‌గా పెంపొందించ‌డ‌మే అంతిమ ల‌క్ష్యంగా ఆహా ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది. 100 శాతం లోక‌ల్ కంటెంట్‌, స‌రికొత్త సాంకేతిక‌త కాంబినేష‌న్‌తో ఆహా ప్రేక్ష‌కుల‌కు అనిర్వ‌చ‌నీయ‌మైన అనుభూతిని క‌లిగించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నది.

  ఆహా గోల్డ్‌గా మారుతున్న ఆహా ప్రీమియమ్ లాంఛ్ వేడుక‌ను ఆగ‌స్ట్ 10 తేదీన భారీ ఎత్తున హైదరాబాద్‌లో నిర్వ‌హించారు. ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఘ‌న విజ‌యం సాధించ‌ట‌మే కాకుండా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న చిత్రం క‌ల‌ర్ ఫొటో మూవీని 4K అల్ట్రా, డాల్బీ సిస్ట‌మ్ సౌండ్‌తో ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఈవెంట్‌లో .. ఆహా గోల్డ్ లోగోను క‌ల‌ర్ ఫొటో టీమ్ ఆవిష్క‌రించింది.

  AHA OTT Launches AHA gold for better user experience with 4K and HD quality

  ఆహా బిజినెస్ హెడ్ కార్తీక్ మాట్లాడుతూ .. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కుల‌తోపాటు ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆహాను ఎంత‌గానో ఆద‌రించారు. ఓటీటీలో సినిమాలు, టెలివిజన్ షోలు, రియాలిటీ షోలను ఎంజాయ్ చేస్తున్న వీక్ష‌కులు బెట‌ర్ ఎక్స్‌పీరెయ‌న్స్‌ను కోరుకుంటున్నార‌నే విషయాన్ని మేము గ్రహించాం. ఆ క్రమంలోనే ఆహా గోల్డ్ రూపంలో కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తున్నాం. 4K, అల్ట్రా HD, డాల్బీ ఆడియో అంశాలు ఆహా గోల్డ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందని భావిస్తున్నాం. అదే స‌మ‌యంలో ఆహా 100 శాతం లోక‌ల్ తెలుగు, త‌మిళ ఓటీటీని కూడా లాంఛ్ చేశాం. ఆహా గోల్డ్‌లో ఈ రెండు ప్యాక్‌ల‌ను చూడటానికి వీలు ఉంటుంది. ఆహా గోల్డ్ క్యాంపెయిన్ కోసం స‌పోర్ట్ చే‌యమ‌ని కోరితే.. వెంటనే అనిల్ రావిపూడి, ప్ర‌శాంత్ వ‌ర్మ మా కోసం యాడ్స్ షూట్ చేశారు. అందుకు వారికి థాంక్స్. ఆహాలో రిలీజైన క‌ల‌ర్ ఫొటో మూవీకి జాతీయ పురస్కారం రావ‌డం చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ సినిమాను ఈ రోజు స్క్రీనింగ్ చేశాం. భ‌విష్య‌త్తులోనూ మంచి కంటెంట్‌ను థియేట‌ర్స్‌లోనూ ఆహా గోల్డ్ స్క్రీనింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామ‌ని తెలియ‌జేస్తున్నాం అని అన్నారు.

  ఆహా సీఈవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆహకు అద్భుతమైన కస్టమర్ బేస్ ఉంది. వారికి ఆహా గోల్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు, త‌మిళ క‌స్ట‌మ‌ర్స్ మంచి క్వాలిటీతో కూడిన కంటెంట్‌ను కోరుకుంటున్నారు. అలాంటి క్వాలిటీ క‌స్ట‌మ‌ర్స్‌కు మంచి అనుభూతిని పంచడమే మా లక్ష్యం. మా వార్షిక ప్రీమియ‌మ్ ప్రేక్ష‌కుల కోసం క్వాలిటీ స‌ర్వీస్‌ను అందించ‌టానికి అడుగులు వేస్తున్నాం. భ‌విష్య‌త్తులో గోల్డ్ స‌బ్ స్క్రైబ‌ర్స్ కోసం మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన ఆఫ‌ర్స్‌ను అందించ‌బోతున్నాం అని అన్నారు.

  ఆహాలో కలర్ ఫోటో, క్రాక్, భీమ్లా నాయ‌క్‌, ల‌వ్‌స్టోరి లాంటి చిత్రాల‌తోపాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న రైట‌ర్‌, మా మ‌ణిద‌న్ వంటి త‌మిళ చిత్రాలు 4K అల్ట్రా HD, డాల్బీ ఆడియోలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్ర‌తి ఒక్క‌రూ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాల‌ని కోరారు. ఆహా గోల్డ్ ప్రీమియ‌మ్‌లో మ‌రో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా భాగ‌మ‌య్యారు.

  Read more about: aha ott ఆహా ఓటీటీ
  English summary
  AHA OTT is providing exclusive Telugu content for the Users. Now, It has been giving AHA Gold facility Who have AHA premium subscription
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X