Aha Dance Ikon గ్రాండ్ లాంచ్.. అల్లు అరవింద్ కి స్టెప్పులు నేర్పిస్తానన్న ఓంకార్
ప్యూర్ తెలుగు ఓటీటీ అని ప్రచారంతో 'ఆహా'.. ప్రారంభించిన రెండేళ్లలోనే మంచి క్రేజ్ సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విభిన్న పద్ధతులు ఫాలో అవుతూ కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల చేయడమే కాక 'అన్ స్టాపబుల్' అనే ఒక టాక్ షోతో ఇండియా వైడ్ టాప్ రేటింగ్ ను సంపాదించుకుని హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తర్వాత 'ఇండియన్ ఐడల్ తెలుగు' ని తెలుగు ప్రేక్షకులకు అందించి తమ ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి మరో మంచి కార్యక్రమం వస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆశీర్వాదం ఎంతో ఉందని
త్వరలోనే 'ఆహా' లో ఓ డాన్స్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఆ విషయాన్ని ఓ గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించింది 'ఆహా'. తెలుగులో రియాలిటీ షో అనగానే మనకు టక్కున గుర్తొచ్చే వ్యక్తి ఓంకార్. ఇప్పుడు 'ఆహా' కోసం 'డాన్స్ ఐకాన్' అనే షోని కూడా ఆయన హోస్ట్ చేస్తూ డైరెక్ట్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ గ్రాండ్ లాంచ్ లో తన సక్సెస్ ఫుల్ జర్నీలో అల్లు అరవింద్ గారి ఆశీర్వాదం ఎంతో ఉందని ఓంకార్ చెప్పుకొచ్చారు

జూలై 10 వరకు
అలాగే ఈ షో కాన్సెప్ట్ తనకు చెప్పగానే 'సందేహమే లేదు నువ్వు సూపర్ సక్సెస్ చేస్తావు' అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారని అన్నారు. ఆహా, ఓక్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సమర్పిస్తున్న 'డాన్స్ ఐకాన్' ద్వారా ఓటీటీలోకి అడుగుపెడుతున్నానని ఓంకార్ అన్నారు. జూన్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ షో డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకు కొనసాగుతాయని అన్నారు.

వాటికి భిన్నంగా
తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఎవరైనా ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చని అన్నారు. 60 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ వీడియోను danceikonoakentertainments.com అనే ఈమెయిల్ కు పంపితే చాలని అన్నారు. నేను గతంలో ఎన్నో డాన్స్ షోస్ చేశాను కానీ ఇది వాటికి భిన్నంగా ఉంటుందని అన్నారు.

టాప్ హీరో మూవీకి
ఈ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనే వారు, వారికి కొరియోగ్రఫీ చేసే వారి జీవితాలను కూడా ఈ షో మార్చేస్తుందని అన్నారు. గెలిచిన కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లోని టాప్ హీరో మూవీకి వర్క్ చేసే ఛాన్స్ దక్కుతుందని ఆయన అన్నారు.

డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తా
అది ఎవరు అనేది మేం ఫినాలే లో చచెబుతామని అనరు. ఈ షో మీ కోసమేనన్న ఆయన, మీరు డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షోలో పార్టిసిపేట్ చేయండి అని కోరారు. ఇక ఈ క్రమంలో అల్లు అరవింద్ ఓంకార్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఒక చిన్న పాటకు డ్యాన్స్ వేయమంటే అల్లు అరవింద్ కొంచెం వింతగా చేసి నవ్వించారు. ఈ క్రమంలో షో అయ్యేలోపు అల్లు అరవింద్ గారితో కూడా స్టెప్పులు వేయిస్తానని ఓంకార్ చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


Click it and Unblock the Notifications











