డైరెక్ట్‌గా ఓటీటీలోకి అక్కినేని హీరో మూవీ.. థియేటర్‌లో రిలీజ్ కాకుండానే.. ఎక్కడ చూడొచ్చంటే?
అందరి హీరోల యందు అక్కినేని హీరోలు వేరయా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క హీరో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు అని వరుస సినిమాలను లైన్లో పెట్టి పరిగెడుతున్నారు. కానీ, అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం నిదానంగా ఏడాదికి ఒక్కో సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు అయితే సరేసరి.
ప్రస్తుతం అక్కినేని నాగార్జున.. కుబేరలో నటిస్తున్నాడు. ఇక ఇంకోపక్క నాగ చైతన్య.. తండేల్ తో బిజీగా ఉన్నాడు. మరో కుర్ర హీరో అఖిల్.. ఇంకా కథలను వినే దగ్గర ఆగిపోయాడు. సుశాంత్.. వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీరందరితో పాటు ఇంకో అక్కినేని హీరో సుమంత్ కూడా అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేస్తూ నేను కూడా ఉన్నాను అని గుర్తుచేస్తున్నాడు.

గోదావరి, మళ్లీరావా, గోల్కోండ హైస్కూల్ తో పాటు మరికొన్ని సినిమాలతో కమర్షియల్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ హీరో. . మళ్లీరావా సక్సెస్ తర్వాత డిఫరెంట్ కథలనే ఎంచుకున్నా అవేవీ అతడికి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక అప్పుడప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు. గతేడాది సార్ సినిమాలో సుమంత్ తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు.
ఇక ఇప్పుడు అహం రీబూట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా థియేటర్ లో కాకుండా ఓటీటీ బాట పట్టడం విశేషం. ఇదేమి కొత్త సినిమా కాదు. దాదాపు మూడేళ్ళ క్రితం ఈ సినిమాను సుమంత్ ప్రకటించాడు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పట్లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అందువల్లే థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అనుకున్న ప్రేక్షకులకు తాజాగా మేకర్స్ ఓటీటీ డేట్ ప్రకటించి కన్ఫర్మ్ చేశారు. ఆహా ఓటీటీలో జూన్ 30 నుంచి అహం రీబూట్ స్ట్రీమింగ్ కాబోతోందని ఆఫీషియల్‌గా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.
ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచుతుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో సుమంత్ ఆర్జే నిలయ్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. టెక్నాలజీతో హత్యలు చేసే విలన్ ను హీరో ఎలా కనిపెట్టాడు అనేది కథగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సుమంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది తెలియాలి. దీని తరువాత అయినా ఈ అక్కినేని హీరోలు వరుస సినిమాలు చేస్తే బావుంటుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











