OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ఆహం రీబూట్.. కోట్లలో వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్న మూవీని చూశారా?
హీరోల కటౌట్స్ లేకున్నా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే విషయాన్ని ఇటీవల చాలా సందర్బాలు నిరూపించాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే అహం రీబూట్. ఒకే పాత్రతో విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఆహాలో రిలీజైంది. ఈ చిత్రానికి ఓటీటీలో వస్తున్న స్పందన చూస్తే.. ఊహించని విధంగా, థియేట్రికల్ రిలీజ్ చేస్తే భారీ విజయం అందుకొనేదనే టాక్ వినిపిస్తున్నది. ఇక ఆహాలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యువ నిర్మాత రఘువీర్ గోరిపర్తి రూపొందించిన ఆహం రీబ్యూట్ సినిమాకు దర్శ కుడు ప్రశాంత్ అట్లూరి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఒకే క్యారెక్టర్‌తో ఈ సినిమాను తీర్చి దిద్దిన విధానానికి దర్శకుడిపై ప్రశంసలు గుప్పిస్తుండగా.. నిర్మాత అభిరుచిని సినీ అభిమానులు కొనియాడుతున్నారు. నిర్మాతగా తొలి చిత్రంతోనే రఘువీర్ తన అభిరుచిని చాటుకున్నారు.

ఆహాం రీబూట్ సినిమా ఒకే ఒక క్యారెక్టర్‌తో కథ నడుస్తుంది. ఆర్జేగా నిలయ్ పాత్రలో సుమంత్ నటించారు. ఆర్జేగా పనిచేస్తున్న సంస్థకు అర్ధరాత్రి ఓ అమ్మాయి కాల్ చేసి.. ఆపదలో ఉన్నాను. కాపాడండి అని వేడుకొంటుంది. అయితే ఆర్జేగా ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు అనే అంశాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పడంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సుమంత్ క్యారెక్టర్ మినహా.. మిగితా క్యారెక్టర్లనీ కేవలం వాయిస్‌తో మాత్రమే ఉంటాయి.
ఆహం రీబూట్ సినిమా జూలై 1వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూవర్ షిప్ వస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాకు 2 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. ప్రయోగాత్మక సినిమాలు, కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రశాంత్, రఘువీర్ లాంటి తపన ఉన్న దర్శకుల ప్రయత్నాలకు తెలుగు ప్రేక్షకుల సపోర్టు ఉంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications











