twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ammu on OTT పొన్నియన్ సెల్వన్ ఫేమ్ ఐశ్వర్య లక్ష్మీ మూవీ ఓటీటీలో..అమ్ము రిలీజ్ ఎక్కడ? ఎప్పుడంటే?

    |

    ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పిస్తున్న చిత్రం అమ్ము. తమిళంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మాణ సారథ్యంలో కల్యాణ్ సుబ్రమణ్యం, కార్తీకేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమాకు చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర, బాబీ సింహా తదితరులు నటించారు. అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి స్పందనను చూరగొంటున్నది. ఈ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    అమ్ము టైటిల్ పాత్రను ఐశ్వర్య లక్ష్మీ పోషించారు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 1 చిత్రంలో పూంగుజాలి పాత్రతో విభిన్నమైన నటనను ప్రదర్శించిన ఐశ్వర్య లక్ష్మి మరోసారి భావోద్వేగమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ ఆమె నటన చాలా హైలెట్‌గా కనిపించింది.

     Aishwarya Lekshmis Ammu to release in Amazon Prime Video OTT on October 13th

    పోలీస్ ఆఫీసర్ నవీన్ చంద్రను ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఐశ్వర్య లక్ష్మీ తీవ్ర వేధింపులకు గురవుతుంది. భర్త పెట్టే చిత్రహింసలను మౌనంగా పంటి కింద పెట్టుకొని భరించే యువతిగా ట్రైలర్‌లో కనిపించింది. అయితే భర్త పెట్టే వేధింపులకు ఎలాంటి జవాబు చెప్పిందనే విషయం ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపించింది. అప్పటి వరకు భర్త హింసను తట్టుకొన్న ఆమె ఒక్కసారిగా ఎదురుతిరిగినట్టు కనిపిస్తుంది. ఆమెకు ధైర్యం నింపడానికి బాబీ సింహా పాత్ర ఉపయోగపడిందా అనేది సస్పెన్స్ ఉంది.

    అమ్ము ట్రైలర్‌లో నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మీ, బాబీ సింహా పాత్రలు ప్రధానంగా కనిపించాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా అమెజాన్ ఓటీటీలో విడుదల అవుతున్నది. ఈ చిత్ర ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. దాంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచుతుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Ponniyan Selvan 1 movie fame Aishwarya Lekshmi is coming with Ammu. This movie to release in Amazon Prime Video OTT on October 13th. Here is the trailer review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X