Farhana OTT: ముస్లిం యువతిగా ఐశ్వర్య రాజేశ్ 'ఫర్హానా'.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ తమిళంలో మాత్రం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయం సాధిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఎక్కువగా ఓటీటీ చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'ఫర్హానా' అనే సినిమాతో థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ఎవరనే విషయంలోకి వెళితే..

తమిళ బ్యూటి:పేరుకు తమిళ బ్యూటి అయిన తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకుంది ఐశ్వర్య రాజేశ్. కౌసల్య కృష్ణమూర్తి అనే మహిళా ప్రాధాన్యత చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు మాత్రం తగ్గలేదు.

Aishwarya Rajesh Farhana Movie OTT Rights To Sony Liv

తెలుగు సినిమాలు:మిస్ మ్యాచ్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి తెలుగు సినిమాలతో ఆకక్టుకునే ప్రయత్నం చేసింది ఐశ్వర్య రాజేశ్. కానీ వీటి ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. దీంతో ఐశ్వర్య ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేయడం సాగించింది. కానీ అవి తెలుగులో డబ్ అయి మంచి ఆదరణ పొందాయి. ఆమె ఎక్కువగా ఓటీటీ సినిమాలతో తెలుగులో పాపులర్ అయింది.

Aishwarya Rajesh Farhana Movie OTT Rights To Sony Liv

ఓటీటీ హీరోయిన్:'సుఢల్: ది వర్టెక్స్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఐశ్వర్య రాజేశ్ 'డ్రైవర్ జమున', 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్', 'రన్ బేబీ రన్', 'స్వప్న సుందరి' వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ తమిళంలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి. తర్వాత ఓటీటీలో అన్ని భాషల్లో విడుదలై అంతకు మించి గుర్తింపు తెచ్చుకున్నాయి. దీంతో ఐశ్వర్య రాజేశ్ ఓటీటీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Aishwarya Rajesh Farhana Movie OTT Rights To Sony Liv

నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం:తాజాగా ఐశ్వర్య రాజేశ్ నటించిన చిత్రమే 'ఫర్హానా'. కె సెల్వరాఘవన్, అనుమోల్ కే మనోహరన్, ఐశ్వర్య దత్తా, జీతన్ రమేష్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Aishwarya Rajesh Farhana Movie OTT Rights To Sony Liv

నెల తర్వాత:మే 12న థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది ఫర్హానా సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ గానే టాక్ వస్తోంది. ఈ క్రమంలో మూవీ ఓటీటీ పార్టనర్ ఆసక్తికరంగా మారింది. ఫర్హానా మూవీ ఓటీటీ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు నెల తర్వాత అంటే జూన్ రెండు, లేదా మూడో వారంలో ఓటీటీలో విడుదల చేయనున్నారట. కాగా ఇందులో ముస్లిం యువతిగా ఐశ్వర్య ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X