నెలకాక ముందే OTTలోకి వచ్చేసిన అద్భుతమైన థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?

ఐశ్వర్యా రాజేష్.. ఈమె పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన చిత్రాలతో ఈ మధ్య తరచుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమె.. తాజాగా మరో అద్భుతమైన చిత్రంతో వచ్చింది. ముఖ్యంగా మలయాళంలో పులిమడ అనే చిత్రంలో నటించి మెప్పించింది. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్ గా, మలయాళ హీరో జోజు జార్జ్ హీరోగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం అంతగా అలరించలేకపోయింది.

ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, జు జార్జ్ లతో పాటు చంబన్ వినోద్ జోసే, లిజోమోల్ జోసే, జాఫర్, జానీ ఆంటోని, చంద్రమేనన్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. అలాగే ఇషాన్ దేవ్ సంగీతం అందించగా.. వేణు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే ఏకే సజన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోగా.. రాజేష్ దామోదరన్, సిజో వడక్కన్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. స్క్రీన్ ప్లే తో పాటు డైరెక్షన్ పనులను కూడా ఏకే సజన్ యే నిర్వర్తించారు.

Aishwarya Rajesh Thriller Movie Pulimada Streaming on Netflix Check Full Details

ఈ సినిమాలో హీరో జోజు జార్జ్ ఓ సివిల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. అయితే 40 ఏళ్లు వచ్చినా ఈయనకు వివాహం కాదు. చూసిన సంబంధాలన్నీ ఏదో ఒక కారణంగా చెడిపోతుండగా.. చివరకు ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంటారు. అయితే పెళ్లి జరిగే రోజునే ఆమె తాను ప్రేమించిన అబ్బాయితో లేచిపోతుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జార్జ్.. తన జీవితంలో ఒక్కసారైనా ముఖ్యంగా ఆరోజు అమ్మాయితో గడపాలని చూస్తాడు. ఈ క్రమంలోనే గ్రామంలో పులి సంచరిస్తుంది అంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తారు.

Aishwarya Rajesh Thriller Movie Pulimada Streaming on Netflix Check Full Details

ఈక్రమంలోనే ఓ అమ్మాయి కారు చెడిపోవడంతో భయంగా ఉంటుంది. ఆమెను చూసిన జార్జ్ సాయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఆమే ఐశ్వర్యా రాజేష్. అయితే అప్పటికే తీవ్ర కోపంతో ఉన్న అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతాడు. ఆ తర్వాత తాగిన మైకంతో అలాగే పడిపోతాడు. ఉదయం లేచి చూసేసరికి ఆమె హత్యకు గురవుతుంది. అయితే ఆ తర్వాత జార్జ్.. ఆమెను ఎవరు చంపారో ఎలా తెలుసుకుంటాడు, ఈ కేసు నుంచి ఎలా బయట పడతాడు అనేదే ఈ సినిమా కథ. సినిమా కథ బాగున్నప్పటికీ.. థియేటర్లలో పెద్దగా ఆడలేదు.

Aishwarya Rajesh Thriller Movie Pulimada Streaming on Netflix Check Full Details

అక్టోబర్ 26వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా నెల కాక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీసు దగ్గర భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవడంలో విఫలం అయిన ఈ చిత్రం నాలుగు వారాలు గడవగానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈరోజుటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ భాషలో తీసిన ఈ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు మీరు ఈ చిత్రాన్ని చూసి ఉండకపోతే ఇప్పుడే ఓ లుక్కేసి ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X