OTT: ఓటీటీలోకి వెంకీ మామ హీరోయిన్ కొత్త సిరీస్.. సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రోజురోజుకు ఓటీటీల క్రేజ్ పెరిగిపోతోంది. థియేటర్లలో సినిమాలు చూసే వారికంటే.. ఓటీటీల్లోనే సినిమాలు, వెబ్‌సిరీస్ చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఓటీటీ లవర్స్ ఆకట్టుకోవడానికి అన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను (సినిమాలు, వెబ్ సిరీస్) తీసుకవస్తుంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, అడ్వెంచర్ థ్రిల్లర్ వంటి వివిధ జానర్ల సినిమాలు, వెబ్‌సీరీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్ మూవీ మరింత క్రేజ్. ఆ క్రేజ్ తగ్గట్టుగా విక్టరీ వెంకటేష్ హీరోయిన్ నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఈ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలో భాషతో సంబంధం లేదు. కంటెంట్ నచ్చితే చాలు వివిధ వెబ్ సిరీసులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందులో మెయిన్ గా క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్స్‌కు ఫుల్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఈ కంటెంట్ పై ఫోకస్ పెడుతున్నాయి. ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది.

గతంలో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వెబ్ సిరీస్ కు సిక్వెల్ రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ ఎంటో కాదు.. 2022లో వచ్చిన తమిళ వెబ్సెరీస్ 'సుడల్: ది వొర్టెక్స్ (Suzhal - The Vortex). ఇందులో కథిర్, ఐశ్వర్య రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డిలు కీలకపాత్రల్లో నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. పుష్కర్-గాయత్రి నిర్మించారు. ఈ తమిళ వెబ్ సిరీస్ .. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది.
అంతేకాదు.. పలు జాతీయ అవార్డులు కూడా అందుకుంది తమిళ వెబ్సెరీస్ 'సుడల్: ది వొర్టెక్స్ (Suzhal - The Vortex). ఆ వెబ్ సిరీస్ కు స్వీకెల్ ఇప్పుడు రాబోతుంది. తాజాగా ఈ సీరీస్ కొనసాగింపుగా 'సుడల్: ది వొర్టెక్స్ 2' స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సుడల్ 1లో నటించిన వారితో పాటు ఈ సీజన్ లో మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ తదితరులు కామియో రోల్స్ లో కనిపించబోతున్నారు. సుడల్ సీజన్-2 వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ నెల ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుడల్ సీజన్-2 తమిళంతో పాటు,తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాకున్నది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

సుడల్ కథ విషయానికి వస్తే.. తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలోని ప్రజలంతా సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో ఓ అమ్మాయి మిస్ అవుతుంది. అదే ఫ్యాక్టరీ పాతికేళ్ల తర్వాత తగలబడుతుంది. ఈ సమయంలో మరో కనిపించకుండా పోతుంది. మరి ఆ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు. మిస్ అయినా నందిని (ఐశ్వర్య రాజేశ్)ఇళ్లు విడిచి కోయంబత్తూరుకు వెళ్లిపోవడానికి కారణమేంటీ? ఆ అమ్మాయిల మిస్సింగ్‌ల వెనుక ఉన్నదేవరు? అనే ఆసక్తికర అంశాలతో ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లతో ఉంటుంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ఎలాంటి రెస్పాస్ వస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











