OTTలోకి రీసెంట్ సూపర్ హిట్ సైక‌లాజిక‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్‌... డోంట్ మిస్!

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మంగళవారం సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్ రన్ పూర్తి చేసుకోగా అప్పుడు చూడడం మిస్ అయిన వారు అందరూ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని ప్రేక్షకులు అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించగా పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన మంగళవారం. సినిమా గత నెల 17న ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో కలసి నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Ajay Bhupathi Payal Rajput Mangalavaram Movie Going to Streaming on Dinsney Plus Hotstar From Dec 26th Full Details Here

సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక త్వరలో డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతుందని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ మేరకు ఈ సినిమా ప్రీమియర్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.

Ajay Bhupathi Payal Rajput Mangalavaram Movie Going to Streaming on Dinsney Plus Hotstar From Dec 26th Full Details Here

ఈ నెలలో 26వ తేదీ నుంచి అంటే మంగళవారం నుంచే ఈ మంగళవారం సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుందనీ ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయనీ మేకర్స్ అంచనా వేస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుక్కుందని, ఆ ఓటీటీలో ప్రసారమవుతుందని ఆ మధ్య కొంత ప్రచారం జరిగింది. కానీ డిస్నీ హాట్ స్టార్ సంస్థ మొత్తం ఐదు భాషలకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసి రిలీజ్ చేస్తోంది.

Ajay Bhupathi Payal Rajput Mangalavaram Movie Going to Streaming on Dinsney Plus Hotstar From Dec 26th Full Details Here

ఇక ఈ సినిమాలో ప్రియదర్శి ఒక కీలకపాత్రలో నటించగా ఆ విషయాన్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమా యూనిట్ చాలా సీక్రెట్ గా ఉంచింది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ విషయం రివీల్ కావడం కూడా సినిమా విజయం సాధించడానికి పనికి వచ్చిందనే చెప్పాలి. మరి ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ను మీరు థియేటర్లలో మిస్ అయితే గనుక ఓటీటీలో వచ్చే మంగళవారం నుంచి చూసేయచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X