Mangalavaram OTT: దిమ్మతిరిగే రేటుకు మంగళవారం ఓటీటీ రైట్స్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
RX 100 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. ఇప్పుడు మంగళవారం అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు వస్తున్నాడు. తనకు లక్కీ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ తో కలిసి.. మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకున్న ఈ సినిమా... తాజాగా డిజిటల్ ప్రిమియర్ హక్కులు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అప్పటి వరకు సినిమాల్లో హీరోయిన్స్ కేవలం పాజిటివ్ రోల్స్ చేసే వాళ్లు... హీరోయిన్స్ అంటే సాఫ్ట్.. కొన్ని సినిమాల్లో అయితే ప్రేక్షక పాత్రే అన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమా వచ్చిందో.. ఒక్కసారిగా అందరి లెక్కలు మారిపోయాయి. అమ్మాయిల్లో కూడా ఇలా ఉంటారా అన్నట్లు అంతా నోరెళ్ల బెట్టారు. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ రేంజ్ వచ్చేసింది అజయ్ భూపతికి. ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు మాత్రం బోల్డ్ హీరోయిన్ అన్న పేరు వచ్చింది.

ఇక ఆ భామకు ఆ తర్వాత మంచి అవకాశాలు రాలేదు. ఇక అజయ్ భూపతి మల్టీ స్టారర్ సినిమా సముద్రం తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇక తనకు లక్కీ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ భామ మరోసారి రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ లో నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలను నెలకోల్పింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించగా... స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి స్వయంగా నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ పతాకాలపై మంగళ వారం మూవీని నిర్మిస్తున్నాడు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇక స్వాతి గునుపాటి.. మెగా ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి కావడంతో... మంగళవారం సినిమాకు సపోర్టుగా ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్ నిలిచారు.
మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాడు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా అల్లు అర్జున్ ఓటీటీ అయిన ఆహానే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకు ఈ సినిమాను సొంతం చేసుకుందని తాజా సమాచాం బయటకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకోగా.. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఇక సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 40 రోజుల తర్వాతే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి థియేటర్ రిలీజ్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట మేకర్స్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో.


Click it and Unblock the Notifications











