OTT వెబ్ సిరీసుల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ వీళ్లే.. సమంతకు ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అవుతోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. విభిన్నమైన జోనర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నారు.
అందుకే కాలానుగుణంగా స్టార్ హీరో హీరోయిన్స్ సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ జోనర్ సిరీసుల్లో నటిస్తూ కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అలా ఓటీటీల్లో నటించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో హీరోయిన్లు ఎవరని చూస్తే..

అజయ్ దేవగణ్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో అజయ్ దేవగన్ ఒకరు. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అందరి స్టార్ల కంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన చేసిన ఏకైక వెబ్ సిరీస్ ఇదొక్కటే. అలాంటి ఈ రుద్ర సిరీస్ లో నటించేందుకు అజయ్ దేవగణ్ ఏకంగా రూ. 125 కోట్లు తీసుకున్నాడని సమాచారం.

సైఫ్ అలీ ఖాన్: ఓటీటీల ద్వారా అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోల్లో ఆదిపురుష్ రావణుడు సైఫ్ అలీఖాన్ ఒకరు. అజయ్ దేవగణ్ తర్వాత రెండో స్థానంలో సైఫ్ ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సేక్రెడ్ గేమ్స్ సీజన్ 1లోని మొత్తం 8 ఎపిసోడ్స్ లలో నటించి ఆకట్టుకున్నాడు. ఇందుకు గాను సైఫ్ రూ. 15 కోట్లు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది.

పంకజ్ త్రిపాఠి: హిందీ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు పంకజ్ త్రిపాఠి. ఈయన దూసుకెళ్తా సినిమాలో విలన్ గా నటించారు. పంకజ్ త్రిపాఠి నటించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత పాపులరో తెలిసిందే. ఇదే కాకుండా సేక్రెడ్ గేమ్స్ తో అలరించిన పంకజ్ త్రిపాఠి అందుకు రూ. 12 కోట్లు, మీర్జాపూర్ 2 కోసం రూ 10 కోట్లు అందుకున్నాడని టాక్.

మనోజ్ బాజ్ పేయి: బాలీవుడ్ విలక్షణ నటుల్లో మనోజ్ బాజ్ పాయ్ ఒకరు. హ్యాపీ, సికందర్ వంటి తదితర తెలుగు సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు మనోజ్ బాజ్ పాయ్. కానీ, ఆయన అన్నిటికి మించి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీసుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు మనోజ్ బాజ్ పాయ్ రూ. 10 కోట్లు తీసుకున్నాడని సమాచారం.

నవాజుద్ధీన్ సిద్ధిఖీ: ఓటీటీ ప్రపంచంలో మొదట్లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. ఈ వెబ్ సిరీసులో ప్రధాన పాత్రలో నటించాడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. ఈ వెబ్ సిరీసులో నటించినందుకు సుమారు రూ. 10 కోట్ల పారితోషికాన్ని నవాజుద్ధీన్ అందుకున్నాడట. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్.

రాధికా ఆప్టే: బాలకృష్ణ లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన బ్యూటి రాధిక ఆప్టే. హిందీ చిత్రపరిశ్రమలో లస్ట్ స్టోరీస్, ఘోల్ వంటి తదితర పాపులర్ వెబ్ సిరీసుల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ సేక్రెడ్ గేమ్స్ సిరీసులో కూడా పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ ప్లే చేసింది. అయితే రెండు, మూడు ఎపిసోడ్స్ కే పరిమితమైన ఆ పాత్ర కోసం రాధిక ఆప్టే దాదాపు రూ. 4 కోట్లు పుచ్చుకుందని సమాచారం.

సమంత: ఓటీటీల్లోకి కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లతోపాటు సమంత కూడా ఎంట్రీ ఇచ్చింది. వెబ్ సిరీసులో నటించడమే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకునేవారి జాబితాలో సామ్ కూడా ఉండటం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత రుత్ ప్రభు రూ. 4 కోట్లు తీసుకుందని టాక్.


Click it and Unblock the Notifications











