ఓటీటీలోకి వచ్చేసిన 70 కోట్ల స్పోర్ట్స్ డ్రామా.. ఫ్రీగా చూడాలంటే మాత్రం షాకే!
ఈ మధ్య కాలంలోనే ఇండియా వ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమల్లోనూ బయోపిక్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న చిత్రాలు మరింతగా తెరకెక్కుతోన్నాయి. అలా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన మరో సినిమానే 'మైదాన్' (Maidaan).
బాలీవుడ్ బడా స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'మైదాన్'. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫుట్‌బాల్ కోచ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఏప్రిల్ 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎమోషనల్ స్టోర్ట్స్ డ్రామాగా రూపొందిన 'మైదాన్' సినిమాకు ఆరంభంలో వేసిన ప్రీమియర్ షోల నుంచే అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా రూ. 70 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసి విజయానికి దూరం అయింది.
అజయ్ దేవగణ్ హీరోగా నటించిన 'మైదాన్' మూవీ విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీగానే పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.

స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన 'మైదాన్' మూవీని జూన్ 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెస్తుందని ఇప్పటికే సమాచారం లీకైంది. అయితే, తాజాగానే ఈ చిత్రం ఆ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి మాత్రం దీన్ని రెంట్ పద్దతిలో తీసుకు వచ్చారు. ఇక, దీన్ని ఫ్రీగా చూడాలంటే మాత్రం జూన్ 5 వరకూ ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా.. అజయ్ దేవగణ్ - అమిత్ శర్మ కలయికలో రూపొందుతోన్న 'మైదాన్' చిత్రాన్ని జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్ జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్ గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించారు. ఇందులో గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్, ఆర్యన్ భౌమిక్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











