ఓటీటీలోకి వచ్చేసిన స్పోర్ట్స్ డ్రామా.. ఉచితంగా చూడాలంటే ఏం చేయాలంటే!

మిగిలిన అన్ని జోనర్ల కంటే బయోపిక్‌‌లతో వచ్చే సినిమాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చే చిత్రాలు మరింత ఎక్కువగా రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో అదే తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా కొద్ది రోజుల క్రితం ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన మూవీనే 'మైదాన్'.

బాలీవుడ్ బడా స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా.. అమిత్ శర్మ రూపొందించిన స్పోర్ట్స్ డ్రామానే 'మైదాన్'. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫుట్‌బాల్ కోచ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఏప్రిల్ 10వ తేదీన గ్రాండ్‌గా విడుదలైంది.

Ajay Devgn Starrer Maidaan Movie Streaming Started On Amazon Prime

ఎమోషనల్ స్టోర్ట్స్ డ్రామాగా రూపొందిన 'మైదాన్' సినిమాకు ఆరంభంలో వేసిన ప్రీమియర్ షోల నుంచే అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా రూ. 70 కోట్లు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసి విజయాన్ని చేరుకోకుండానే ఆగిపోయింది.

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన 'మైదాన్' మూవీ విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీగానే పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు న్యూస్ లీక్ అయింది.

అజయ్ దేవగణ్ నటించిన 'మైదాన్' మూవీని జూన్ 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెస్తుందని ఇప్పటికే ప్రకటించింది. కానీ, రెంట్ పద్దతిలో ఇటీవలే స్ట్రీమింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్‌ను మొదలుపెట్టేసింది. గత అర్ధరాత్రి నుంచే ఇది ప్రసారం అవుతోంది. దీంతో సామాన్యులు అందరూ దీనికోసం ఎగబడుతున్నారు.

Ajay Devgn Starrer Maidaan Movie Streaming Started On Amazon Prime

ఇదిలా ఉండగా.. అజయ్ దేవగణ్ - అమిత్ శర్మ కలయికలో రూపొందుతోన్న 'మైదాన్' చిత్రాన్ని జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్ జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్ గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించారు. ఇందులో గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్, ఆర్యన్ భౌమిక్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X