ఓటీటీలోకి వచ్చేసిన రియల్ హర్రర్ మూవీ.. వణికించే ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే!
కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ హర్రర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఫలితంగా చిన్న చిన్న హీరోల నుంచి పెద్ద స్టార్ల వరకూ ఇలాంటివి చేయడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలా కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'సైతాన్'.
అజయ్ దేవగణ్, జ్యోతిక, మాధవన్ లీడ్ రోల్స్‌లో వికాశ్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'సైతాన్'. సైతాన్ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలతో ఓ అమ్మాయిని నియంత్రించడం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సైతాన్' మూవీని మార్చి 8వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ఆరంభంలోనే అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఇది ఫుల్ రన్‌లో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
వణుకు పుట్టించే కాన్సెప్టుతో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'సైతాన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీ స్థాయిలోనే పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.

స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన 'సైతాన్' మూవీని మే 4వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగానే నేటి అర్ధరాత్రి నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీ ఆడియోతో మాత్రం అందుబాటులోకి తెచ్చింది. అయినా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోన్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. అజయ్ దేవగణ్ - వికాశ్ బాల్ కలయికలో రూపొందుతోన్న 'సైతాన్' చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై వికాశ్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవగణ్, అభిషేక్‌లు నిర్మించారు. ఇందులో జంకి బొడివాల, అంగద్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ హర్రర్ మూవీకి అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











