Vidaamuyarchi OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి అజిత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
గతేడాది వరుస పరాజయాలతో డీలా పడిపోయింది కోలీవుడ్ ఇండస్ట్రీ. ఈ దశలో విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా భారీ విజయం సాధించి తమిళ చిత్ర పరిశ్రమకు
కొత్త ఏడాది మదగజరాజా ఊపిరి పోసింది. ఆ వెంటనే వచ్చిన అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన విదాముయార్చిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వీటిని తలకిందులు చేస్తూ ఈ సినిమా బాక్షాఫీస్ వద్ద పరాజయం మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో విదాముయార్చి ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే
ఎప్పుడో రెండేళ్ల క్రితం తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్ కుమార్ నుంచి ఏడాదిన్నరగా ఎలాంటి సినిమా రాకపోవడంతో అభిమానులు మంచి ఆకలితో ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆయన నటించిన విదాముయార్చి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అజిత్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా అర్జున్ , రెజినా, రమ్య సుబ్రహ్మణ్యం, నిఖిల్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో అజిత్ కుమార్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని విదాముయార్చిని తెలుగులో పట్టుదల పేరుతో విడుదల చేశారు.

విడుదలకు ముందే టీజర్లు, ట్రైలర్లు, అజిత్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విదాముయార్చి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. తమిళనాడులో రూ.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.20 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు, కర్ణాటక + కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.6 కోట్లు చొప్పున మొత్తంగా రూ.95 కోట్ల చొప్పున వ్యాపారం జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.185 కోట్ల గ్రాస్.. రూ. 97 కోట్ల షేర్ రావాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన విదాముయార్చి సినిమాకు తొలి రోజు రూ.26 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఆ తర్వాత నుంచి అజిత్ చిత్రానికి కలెక్షన్స్ పడిపోతూనే ఉన్నాయి. తొలి వారం రూ.75 కోట్లు రాగా.. మళ్లీ పుంజుకోలేదు. నిన్న మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 143 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. చాలా ఏరియాలలో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియగా భారీ నష్టాలను మిగిల్చింది విదాముయార్చి. రూ.185 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన అజిత్ చిత్రం కేవలం 60 శాతం మాత్రమే రికవరీ సాధించినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిన నేపథ్యంలో విదాముయార్చి ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ.75 కోట్లకు పైగా వెచ్చించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓటీటీ నిబంధనలను అనుసరించి మార్చి 3న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. అంటే సినిమా విడుదలైన 25 రోజుల్లోపే విదాముయార్చి ఓటీటీలోకి రానుంది. థియేటర్‌లో సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం సక్సెస్ కొడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











