Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ రిలీజ్‌పై ట్విస్ట్.. బాలయ్య మూవీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ డెసిషన్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ అఖండ 2. మూడేళ్ల క్రితం విడుదలైన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదాపడి వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2: తాండవంను నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.

బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలకపాత్ర పోషించారు. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు అందించగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే...

Akhanda 2 OTT Release Twist Netflix s Shocking Decision on Balakrishna s Film Streaming

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌ కావడంతో అఖండ 2కు భారీగా బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అఖండ 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అయితే బాక్సాఫీస్ జర్నీలో బాలయ్య మూవీ తడబాటుకు గురైంది. దురంధర్‌తో పాటు అవతార్ 3 వంటి చిత్రాల నుంచి గట్టిపోటీ ఎదురు కావడంతో పాటు మిక్స్‌డ్ టాక్ కారణంగా అఖండ 2కి వసూళ్లు పడిపోయాయి.

అఖండ 2 తొలివారం 76.75 కోట్ల రూపాయలు, రెండో వారంలో 12.3 కోట్ల రూపాయలు, మూడో వారంలో 4.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 26వ రోజు వరకు ఈ సినిమాకు ఇండియా వైడ్ 94.14 కోట్ల రూపాయలు.. 111 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కర్ణాటకలో 11.14 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 91.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.17 కోట్ల రూపాయలు, కేరళలో 16 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2.33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో అఖండ 2కు నార్త్ అమెరికాతో పాటు ఇతర దేశాలలో కలిపి 12.35 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 123.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది అఖండ 2.

అఖండ 2 లాభమెంత? నష్టమెంత?
అఖండ 2 లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 104 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 65 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దాంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా దాదాపు 40 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. అటు 208 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌కు గాను ఇప్పటి వరకు 124 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి 84 కోట్ల రూపాయల గ్రాస్ లోటుతో బిజినెస్ క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అఖండ 2 ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్
అఖండ 2 ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ జరిగేలా ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 9న అఖండ 2 ఓటీటీలోకి వస్తుందని నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌లో పేర్కొంది. అలాగే అప్‌కమింగ్ చిత్రాల లిస్ట్‌లోనూ పోస్టర్ వేసింది. థియేటర్‌లో పాస్ మార్కులు వేయించుకోలేకపోయిన అఖండ 2.. ఓటీటీలో ఎలా వర్కవుట్ అవుతుందోనని ట్రేడ్ పండితులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇలాంటి దశలో బాలయ్య అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చింది. ప్రస్తుతం అఖండ 2 సినిమా పోస్టర్ నెట్‌ఫ్లిక్స్‌లోని అప్‌కమింగ్ చిత్రాల విభాగంలో కనిపించడం లేదు. అలాగే మూవీ లింక్‌ను కూడా తప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అఖండ 2 స్ట్రీమింగ్ డేట్ ప్రకటించకపోవడం.. ఈ పరిణామాలతో గందరగోళం నెలకొంది. అయితే మరో కొత్త తేదీతో నెట్‌ఫ్లిక్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏం జరుగుతుందో తెలియక బాలయ్య అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.

More from Filmibeat

Read more about: akhanda 2 nandamuri balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X