Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. బాలయ్య మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ 2. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమా వాయిదాపడి వారం రోజుల విరామం తర్వాత డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అఖండ 2. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి చిత్రసీమలో చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషించింది. విజి చంద్రశేఖర్, కబీర్ దుహాన్ సింగ్, సస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, శరత్ లోహితాశ్వ, రవిప్రకాశ్, సర్వదమన్ డీ బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

అఖండ 2 బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. అఖండ క్రేజ్, బాలయ్య ఛరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయలు, నైజాంలో 30 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా 2200 థియేటర్స్‌లో విడుదల చేశారు.
అఖండ 2 కలెక్షన్స్
అఖండ 2కు ప్రీమియర్స్‌కు 8 కోట్ల రూపాయలు, తొలిరోజు 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోటి రూపాయలు, నాలుగో రోజున 5.4 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్ ఇప్పటి వరకు 66.5 కోట్ల రూపాయల నెట్.. 78.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. నార్త్ అమెరికా, ఇతర దేశాలు కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 10.6 కోట్ల రూపాయలు వసూలు చేశాడు బాలయ్య. దాంతో అఖండ 2కి నాలుగు రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 89.35 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల వరకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ ఏరియాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 14.05 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 9.21 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.23 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.40 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.43 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.70 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.99 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 64.5 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, కన్నడంలో 8 కోట్ల రూపాయలు, తమిళంలో 3.08 కోట్ల రూపాయలు, కేరళలో 10 లక్షల రూపాయలు చొప్పున అఖండ 2 వసూలు చేసింది.
అఖండ 2 ఓటీటీ
అఖండ 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా నుంచి నెట్‌ఫ్లిక్స్ తన ఓటీటీ డీల్స్ విషయంలో కొత్త తరహా విధానాన్ని ఫాలో అవుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం సినిమా హిట్ అయితే ఓకే.. ఒకవేళ బాక్సాఫీస్ వద్ది నిరాశపరిస్తే మాత్రం డీల్ వాల్యూలో 25 శాతం కట్ చేయనున్నారు. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రావాలనే నిబంధన ప్రకారం ఒప్పందం కుదిరింది. దాంతో అఖండ 2 డిసెంబర్ రెండో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 9న అఖండ 2 స్ట్రీమింగ్ అవుతుందని ఫిలింనగర్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











