ఓటీటీలో అఖండ 2కు షాకింగ్ రిజల్ట్... నెట్‌ఫ్లిక్స్‌లో బాలయ్య మూవీ హిట్టేనా?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ అఖండ 2. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదాపడి వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ దగ్గరి నుంచి పలు అంశాల్లో వివాదాల్లో చిక్కుకున్న అఖండ 2 మూవీ ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఓటీటీలో బాలయ్య మూవీ ఎలాంటి రిజల్ట్ రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...
అఖండ 2 బడ్జెట్ ఎంత?
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2: తాండవంను దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలకపాత్ర పోషించారు. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.

అఖండ 2 వరలైడ్ వైడ్ కలెక్షన్స్
అఖండ 2కు వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అఖండ 2 తొలివారం 76.75 కోట్ల రూపాయలు, రెండో వారంలో 12.3 కోట్ల రూపాయలు, మూడో వారంలో 4.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 26వ రోజు వరకు ఈ సినిమాకు ఇండియా వైడ్ 94.14 కోట్ల రూపాయలు.. 111 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కర్ణాటకలో 11.14 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 91.15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.17 కోట్ల రూపాయలు, కేరళలో 16 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2.33 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అఖండ 2కి లాభమెంత? నష్టమెంత?
ఇక ఓవర్సీస్‌లో అఖండ 2కు నార్త్ అమెరికాతో పాటు ఇతర దేశాలలో కలిపి 12.35 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 123.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది అఖండ 2. దాంతో డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా దాదాపు 40 కోట్ల రూపాయల నష్టాన్ని... అటు 208 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌కు గాను ఇప్పటి వరకు 124 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి 84 కోట్ల రూపాయల గ్రాస్ లోటుతో భారీ నష్టాన్ని మిగిలిచ్చింది.
అఖండ 2 ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్
అఖండ 2 ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ జరిగేలా ఒప్పందం చేసుకున్నారు. తొలుత జనవరి 9న అఖండ 2 ఓటీటీలోకి వస్తుందని నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో పేర్కొంది. అలాగే అప్‌కమింగ్ చిత్రాల లిస్ట్‌లోనూ పోస్టర్ వేసింది. అయితే ఆ వెంటనే అఖండ 2 సినిమా పోస్టర్ నెట్‌ఫ్లిక్స్‌లోని అప్‌కమింగ్ చిత్రాల విభాగంలో కనిపించకపోవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. కానీ ముందుగా ప్రకటించిన జనవరి 9కే అఖండ 2ను ఓటీటీలోకి తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ 2 రిజల్ట్ ఏంటీ?
ఓటీటీ వర్గాల లెక్కల ప్రకారం.. అఖండ 2కు నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న స్పందన ఆశించిన స్థాయిలో లేదు. జనవరి 9న తెలుగు సహా పలు భాషల్లో బాలయ్య మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. జనవరి 9- జనవరి 11 మధ్య ఫస్ట్ వీకెండ్‌లో అఖండ 2కు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాంతో భారత్ సహా 7 దేశాలలో బాలయ్య సినిమా టాప్ 10లో ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత జనవరి 12 నుంచి జనవరి 18 వరకు అఖండ 2కు 1.9 మిలియన్ల వ్యూస్‌ను సాధించి 12 దేశాలలో టాప్ 10లో ట్రెండ్ అయ్యింది. అయితే పలు భాషల్లో సినిమాను విడుదల చేసిన విధానం, డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ధర వెచ్చించడంతో పోలిస్తే.. అఖండ 2కు వస్తున్న స్పందనను బట్టి చూస్తే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో బాలయ్య మూవీ యావరేజ్‌గా నిలిచిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అఖండ 2ను చూస్తోన్న వీక్షకుల సంఖ్య తక్కువగా లేదు.. అలాగనీ అసాధారణంగానూ లేదని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











