Akhanda 2 OTT Release Date: ఓటీటీలో ‘అఖండ 2' తాండవానికి డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Akhanda 2 OTT Release Date: నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన డివోషనల్ యాక్షన్ డ్రామా అఖండ 2: తాండవం (Akhanda 2: Taandavam) ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి భారీ చర్చకు కారణమైన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌పై తాజాగా అధికారిక క్లారిటీ వచ్చింది. ఓటీటీలో బాలయ్య తాండవానికి డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ అఖండ 2 : తాండవం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ'కు ఇది సీక్వెల్. 'అఖండ 2: తాండవం'ను భక్తి, యాక్షన్, ఫాంటసీ అంశాల మేళవింపుతో భారీ స్థాయిలో రూపొందించారు. తేజస్విని నందమూరి సమర్పణలో, 14 రీల్స్ ప్లస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్ అచంట, గోపీ అచంట, ఇషాన్ సక్సెనా ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనాన్ (Samyuktha Menon), ఆది పినిశెట్టి, హర్షల్ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, అచ్యుత్ కుమార్, సాయికుమార్, పూర్ణ, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి థమన్ అదిరిపోయే సంగీతం అందించగా, తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్ - సంతోష్ దేట్కే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

Akhanda 2 Taandavam OTT Release Date Balakrishna s Taandavam to Stream on Netflix from January 9

అఖండ మొదటి భాగం సాధించిన భారీ విజయం కారణంగా అఖండ 2పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా దాదాపు 103 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 104 కోట్ల షేర్, అంటే సుమారు 208 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదు. దురంధర్, అవతార్ 3 వంటి పెద్ద సినిమాల పోటీతో పాటు మిక్స్‌డ్ టాక్ అఖండ 2పై ప్రభావం చూపింది.

వసూళ్ల పరంగా చూస్తే.. తొలి వారం 76.75 కోట్లు, రెండో వారం 12.3 కోట్లు, మూడో వారం 4.1 కోట్లు మాత్రమే రాబట్టింది. 26వ రోజు వరకు ఇండియా వైడ్‌గా 94.14 కోట్ల షేర్, సుమారు 111 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 91.15 కోట్లు, కర్ణాటకలో 11.14 కోట్లు, తమిళనాడులో 5.17 కోట్లు, కేరళలో కేవలం 16 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో నార్త్ అమెరికా సహా ఇతర దేశాల్లో కలిపి సుమారు 12.35 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు దాదాపు 123.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అయితే లాభాల్లోకి రావాలంటే అవసరమైన 104 కోట్ల షేర్‌తో పోలిస్తే ఇప్పటివరకు కేవలం 65 కోట్ల షేర్ మాత్రమే రావడంతో, డిస్ట్రిబ్యూషన్ పరంగా సుమారు 40 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే లక్ష్యంగా పెట్టుకున్న 208 కోట్ల గ్రాస్‌కు బదులు సుమారు 124 కోట్ల వద్దే బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని, దాంతో దాదాపు 80-85 కోట్ల గ్రాస్ లోటు తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

'అఖండ 2' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. తాజాగా సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా జనవరి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా అందుబాటులోకి రానుండటంతో, పాన్ ఇండియా స్థాయిలో మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద, 'అఖండ 2: తాండవం' జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం అందుకోకపోయినా ఈ మూవీ .. ఓటీటీలో ఎలాంటి విజయం సాధిస్తోందో? వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X