ఎట్టకేలకు ఓటిటిలో అఖిల్ అక్కినేని ఏజెంట్.. ఎప్పుడు? ఎందులో అంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దగ్గర ఉన్న పలు పాపులర్ సినీ ఫ్యామిలీ లలో అక్కినేని వారి కుటుంబం కూడా ఒకటి. మరి అక్కినేని కుటుంబం నుంచి ఉన్న సీనియర్ హీరో సహా యంగ్ హీరోస్ లో అఖిల్ అక్కినేని కూడా ఒకడు. కాగా అఖిల్ పరిస్థితి డెఫినెట్ గా మిగతా హీరోస్ లో పోలిస్తే చాలా డిఫరెంట్ అని చెప్పాలి.
మిగతా అక్కినేని హీరోలకి ప్లాప్ లు వస్తే నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటి అనేది అర్ధం కాదు కానీ ఇంట్రెస్టింగ్ గా అఖిల్ కి ప్లాప్ వచ్చినా అదేంటో కానీ నెక్స్ట్ సినిమాకి సూపర్ క్రేజ్ అండ్ బిజినెస్ సొంతం అవుతాయి. అలా అఖిల్ చేసిన ఓ భారీ చిత్రమే "ఏజెంట్". దర్శకుడు సురేందర్ రెడ్డి తో చేసిన ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాగా అప్పట్లో ఈ సినిమాకి స్టార్ హీరోస్ రేంజ్ హైప్ ని కూడా అందుకుంది.

సమయం మించి పోవడంతో దీని హైప్ కాలంతో పాటుగా కరిగిపోయింది. దీనితో చాలా తక్కువ బజ్ కి పడిపోయి థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చాక ఒకెత్తు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఒకెత్తు అని చెప్పాలి. ఇదెలా అంటే జెనరల్ గా ఎంత ప్లాప్ సినిమా అయినప్పటికీ ఇప్పుడు ఉన్న మూమెంట్ ఓ చాలా త్వరగానే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
కానీ అయ్యగారి సినిమాకి మాత్రం అలా జరగలేదు. చాలా నెలల సస్పెన్స్ తర్వాత ఓటిటి పార్ట్నర్ ఎవరు అనేది కూడా క్లారిటీ రాలేదు. అలా ఫైనల్ గా సోనీ లివ్ సొంతం చేసుకొని డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ ఇంకా రాలేదు దాదాపు ఏడాది దాటిపోయినా కూడా ఈ సినిమా ఓటిటిలో రాలేదు దీనితో ఈ చిత్రం ఓ రేంజ్ హైప్ ని ఓటిటి వెర్షన్ కి కూడా తెచ్చుకుంది.
అయితే ఫైనల్ గా ఈ సినిమా తెలుగు కాకుండా హిందీలో టీవీ ప్రీమియర్ గా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి తెలుగు ఎప్పుడు అంటే దానిపైనే లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా సెన్సేషనల్ సినిమా హను మాన్ కి కూడా మొదట హిందీలోనే టీవీ ప్రీమియర్ ఇంకా ఓటిటి డేట్ ని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తెలుగు ఇతర భాషలు క్లారిటీ వచ్చింది.

మరి ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో ఏజెంట్ మొదట హిందీలో వస్తుండగా నెక్స్ట్ తెలుగులోనే అన్నట్టు వినిపిస్తుంది. ఇలా ఈ సినిమా ఈ జూలై లోనే వస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఈ జూలై మధ్యలో కానీ జూలై చివరికి తెలుగులో అదే సోనీ లివ్ లో రానుంది అని లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా సాక్షి వైద్య అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆలాగే ఈమె ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా అనిల్ సుంకర నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











