Agent OTT: ఏజెంట్ ఓటీటీ ఆలస్యం.. సోనీ ఏం చెప్పిందంటే!
టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయినా.. ప్రయత్నాలను మాత్రం ఆపకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు అక్కినేని అఖిల్. ఆరంభంలోనే మూడు ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ జోష్‌లోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ దాదాపు రూ. 80 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం భారీగా బిజినెస్‌ను జరుపుకుని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన చిత్రమే 'ఏజెంట్'. ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్‌ను ఆశించిన రీతిలో ఇది రాబట్టలేకపోయింది. అంతేకాదు, రెండో రోజు నుంచి దీనికి కలెక్షన్లు డౌన్ అవుతూ వచ్చాయి. ఇలా ఈ సినిమా అతి తక్కువ వసూళ్లతోనే రన్‌ను ముగించుకుంది. ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కొని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ 'ఏజెంట్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని టాక్ వచ్చింది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఏజెంట్' మూవీపై అంచనాలు ఉండడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక, థియేటర్లలో ఇది పెద్దగా రాణించలేకపోవడంతో మే 19వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే, ఈరోజు నుంచే స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం ఓటీటీలోకి రాలేదు. దీనిపై సోనీలివ్ సంస్థ స్పందిస్తూ.. 'ఈ సినిమా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దీనిపై పూర్తి సమాచారం కోసం మా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వండి' అని ట్వీట్ చేసింది.

అఖిల్ నటించిన 'ఏజెంట్'మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు. ఊర్వశీ ఓ స్పెషల్ సాంగ్ చేసింది.


Click it and Unblock the Notifications











