Agent OTT: ఎట్టకేలకు ఓటీటీ కొత్త డేట్ ఫిక్స్.. ఆ మార్పులతో వస్తున్న ఏజెంట్

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చి.. ఎంతో కష్టపడుతున్నా సరైన విజయాలను మాత్రం సొంతం చేసుకోలేక ఇబ్బంది పడుతోన్నాడు హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్. తెరంగేట్రం చేసిన తర్వాత చాలా సినిమాల్లో నటించిన అతడు.. కేవలం ఒకే ఒక్క హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

అయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక, ఈ సారి కచ్చితంగా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో అఖిల్ 'ఏజెంట్' అనే సినిమా చేశాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొంది.. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Akhil Akkineni Starrer Agent Movie Streaming on SonyLIV From June 23rd

అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన సినిమానే 'ఏజెంట్'. ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్‌ పెద్దగా రాలేదు. ఆ తర్వాత కూడా పెద్దగా రాణించని ఈ చిత్రం వారం రోజుల్లోనే చాలా తక్కువ వసూళ్లతోనే రన్‌ను ముగించుకుంది.

ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కొని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 'ఏజెంట్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోనీ లివ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'ఏజెంట్' మూవీ మే 19వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉన్నా.. అలా జరగలేదు. దీంతో సోనీ లివ్ సంస్థ త్వరలోనే వస్తుంది అని మాత్రమే చెప్పింది. ఈ ఆలస్యానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతుండడమే అని తర్వాత తెలిసింది.

Akhil Akkineni Starrer Agent Movie Streaming on SonyLIV From June 23rd

ఇందులో ఉన్న అనవసరపు సన్నివేశాలను, ల్యాగ్ అయిన ఫైట్లను ఎడిట్ చేశారట. అలాగే, ఇందులో ఎన్నో మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఇది జూన్ 23వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవబోతుందని తాజాగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. 'ఏజెంట్' మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. ఊర్వశీ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ స్టోరీ ఇచ్చిన దీనికి.. హిప్‌హాప్ తమీజా దీనికి సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X