Agent OTT: ఏజెంట్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. 80 కోట్ల సినిమా నెల కూడా కాకముందే!

అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. కెరీర్ ఆరంభంలోనే పరాజయాల పరంపరతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్. ఏకంగా మూడు ఫ్లాపులతో సతమతం అయిన అతడు.. గత ఏడాది వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే మూవీ చేశాడు. దాదాపు రూ. 80 కోట్లు బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అందుకు తగ్గట్లుగానే భారీగా బిజినెస్‌ను చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Akhil Akkineni Starrer Agent

అక్కినేని అఖిల్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో రూపొందిన సినిమానే 'ఏజెంట్'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీ నిరాశజనకమైన టాక్‌ను దక్కించుకుంది. దీంతో ఓపెనింగ్స్‌ను ఆశించిన రీతిలో ఇది రాబట్టలేకపోయింది. అంతేకాదు, రెండో రోజు నుంచి దీనికి కలెక్షన్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఈ చిత్రానికి దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్ 'ఏజెంట్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై ప్రకటన వచ్చింది.

Akhil Akkineni Starrer Agent

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఏజెంట్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా రాణించలేకపోతోంది. ఫలితంగా ఈ మూవీని మే 19వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంటే ఏప్రిల్ 28న విడుదలైన 'ఏజెంట్' నెల కూడా కాకముందే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంది.

Akhil Akkineni Starrer Agent

అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్'మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు. ఊర్వశీ రౌటేలా ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X