Agent OTT: ఆ ఓటీటీలోకి ఏజెంట్.. విడుదలైన అన్ని రోజులకే స్ట్రీమింగ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఏఎన్నార్ తర్వాత ఎంతో మంది సినీ రంగానికి సేవలు అందిస్తూ ఉండడమే. దీనికితోడు చాలా మందే హీరోలుగా సందడి చేస్తుండడం కూడా.

అలాంటి వారిలో హ్యాండ్సమ్ గాయ్ అక్కినేని అఖిల్ ఒకడు. అయితే, ఈ చిన్నోడు మాత్రం హీరోగా పరిచయమైన చాలా కాలానికి కానీ ఒక హిట్‌ను ఖాతాలో వేసుకోలేకపోయాడు. దీని తర్వాత ఇప్పుడు ఎంతో కష్టపడి మరీ 'ఏజెంట్' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Akhil Akkineni Starrer Agent Movie Streaming On SonyLIV From May Last Week

అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమే 'ఏజెంట్'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే దక్కుతోంది.

దీంతో మొదటి రోజు షోలు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఏజెంట్' మూవీ ఓటీటీ డీల్ గురించి, స్ట్రీమింగ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'ఏజెంట్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంటే ఏప్రిల్ 28న విడుదలైన 'ఏజెంట్' మే చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్ నటించిన మూవీనే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు. ఊర్వశీ రౌటేలా ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X